ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ పై, వైసీపీలో నిరసనలు, అలకలు ఇంకా బయట పడుతూనే ఉన్నాయి. రోజుకి ఒకరు బయటకు వస్తూ నిరసన తెలుపుతున్నారు. నిన్న కాపు రామచంద్రా రెడ్డి నిరసన తెలిపితే, ఈ రోజు ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆ లిస్టు లో చేరారు. అయితే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మాత్రం తెలివిగా తన అసంతృప్తిని బయటకు చూపించకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలో మంత్రి పదవి ఆశించి భంగ పడ్డ మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పిలిచి బుజ్జగించి, సెటిల్మెంట్ చేసి పంపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ రోజు కుటంబ సమేతంగా, మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అయితే ఇదే సమయంలో, మంగళగిరి టౌన్ లోనే ఉన్న ఆళ్ల రామకృష్ణా రెడ్డి అటు వైపు కూడా తొంగి చూడలేదు. సజ్జల పర్యటన చేసిన ప్రాంతంలో లేకుండా, సజ్జలని కలిసే ప్రయత్నం కూడా చేయకుండా ఆళ్ల రామకృష్ణా రెడ్డి, తన కార్యాలయానికే పరిమితం అయ్యి, సజ్జలను కనీసం లెక్క చేయలేదు.

alla 13042022 2

ఇదే సమయంలో, ఇటీవల కాలంలో మంగళగిరి నుంచి నూతనంగా ఎన్నికైనా ఎమ్మెల్సీతో పాటుగా, ఇతర నేతలు సజ్జల పర్యటనలో ఉన్నారు. వీరు ఇరువురూ, సజ్జలతోనే ఉంటూ, సజ్జల పర్యటన అయ్యే దాకా అక్కడే ఉండి, అన్ని ఏర్పాట్లు చేసారు. ఇదే సమయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, తన కార్యాలయం నుంచి ఒక వీడియో విడుదల చేసారు. మంత్రి వర్గ విస్తరణ పై తనకు చోటు రాలేదని ఎక్కడా అసంతృప్తి లేదని, తాను జగన్ ఎలా చెప్తే అలా నడుచుకుంటానని గతంలోనే చెప్పానని, తనకు మంత్రి ఇచ్చినా, ఇవ్వకపోయినా, ఎవరికి ఇచ్చినా, జగన్ వెంటే నడుస్తానని వీడియో ఒకటి విడుదల చేసి తన కార్యాలయానికే పరిమతం అయ్యారు. అదే సమయంలో సజ్జల, మంగళగిరి వస్తే, మిగతా నేతలు అందరూ వెళ్ళటం, ఆళ్ల రామకృష్ణా రెడ్డి మాతమ్రే వెళ్లకపోవటం పై చర్చనీయంసం అయ్యింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read