12 ఓట్లుతో గెలిచిన ఎమ్మల్యే... ఎవరైనా ప్రజలకి మంచి చేసి, వచ్చే ఎలక్షన్స్ లో ఇలా 12 ఓట్లుతో కాకుండా, 12 వేల ఓట్లతో గెలివాలి అనుకుంటారు... కాని ఈయన ప్రజలను గాలికి వదిలేసి, వాళ్ళ పార్టీ అధినేత సేవలు తరిస్తూ ఉంటాడు... ఏ లిటిగేషన్ దొరుకుతుందా, ఎవరి మీద కేసు వేద్దామా అని చూస్తూ ఉంటాడు... చివరకి ఏ కేసు నిలబడు అనుకోండి అది వేరే విషయం... కాని, ఈ లోపు కేసు వేసి, సాక్షి టీవీలో హడావిడి చేస్తూ ఉంటారు... కేసు కొట్టేసిన రోజు మాత్రం, అసలు సాక్షిలో వార్తే ఉండదు... ఆంధ్రజ్యోతి ఏండి రాధాకృష్ణ అరెస్ట్ అయిపోతున్నాడు అని హడావిడి హడావిడి చేసారు... చివరకు నిన్న కోర్ట్ ఆళ్ళని నాలుగు తిట్టి, కేసు కొట్టేసింది... వివరాలు ఇలా ఉన్నాయి...

alla 0601218 2

వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్ జగన్ పై 'ఆంధ్రజ్యోతి ప్రచురించిన కధనం పై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి హైకోరులో చుక్కెదురైంది. ఆయన వేసిన పరువునష్టం కేసును శుక్రవారం కొట్టివేసింది. జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఇచ్చిన వినతి పత్రంపై "అమ్మ జగనా". ఆనే కథనాన్ని గత ఏడాది మే 15న 'ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఈ కధనం తమ పార్టీ నాయకుడికి, పార్టీకి నష్టం చేకూర్చేలా ఉందని, అసత్య కథనాలు ప్రచురించారని ఆరోపిస్తూ ఆళ్ల రామకృషారెడ్డి నాంపల్లి క్రిమినల్ కోరులో పరువు నష్టం కేసు చేశారు. ఈ కేసును కొట్టి వేయాలని 'ఆంధ్రజ్యోతి యాజమాన్యం హైకోరులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది.

alla 0601218 3

ఈ వ్యాజ్యాన్ని లోతుగా విచారించిన హైకోర్ట్ శుక్రవారం 68 పేజీలు సుదీర్ఘమైన తీర్పును వెలువరించింది. వేర్వేరు సందర్భాల్లో సుప్రీంకోరు ఇచ్చిన పలు తీర్పులను న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఉటంకించారు. ఆ కథనంతో మీకేం సంబంధం ఉందని పిటిషనర్ను నిలదీశారు. సంబంధంలేని అంశం పై కోర్ట్ ను ఎలా ఆశ్రయిస్తారని ప్రశ్నించారు. పిటిషనర్ కు ఎలాంటి అర్హతా లేదని స్పష్టం చేశారు. రామకృష్ణా రెడ్డి కింది కోర్ట్ లో దాఖలు చేసిన పరువ నష్టం కేసును కొట్టి వేశారు. ఈ కేసులో నాంపల్లి క్రిమినల్ కోర్ట్ జారీచేసిన వారెంటు రద్దుపుతాయని స్పష్టం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read