మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈ సారి టికెట్ ఇచ్చేది లేదని సీఎం జగన్ రెడ్డి చెప్పేశారని, అందుకే ఆయన అలకబూనారని వార్తలు వస్తున్నాయి. మంగళగిరి సీటు ఇవ్వనని సీఎం జగన్ రెడ్డి చెప్పేశారట కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే, కుప్పంలో చంద్రబాబు పోటీ చేస్తారా అంటూ, ఎదురు ప్రశ్నించడంతో అసలు గుట్టురట్టయ్యింది. తాడేపల్లిలో సీఎం సమావేశానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి గైర్హాజరు కావడంతో మీడియాలో వస్తున్న కథనాలు నిజమయ్యాయి. ఇటీవలే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తనయుడు పెళ్లయ్యింది. ఆ పెళ్లికి సీఎంని ఎమ్మెల్యే ఆహ్వానించలేదు. సీఎం ఎన్నికల సన్నాహాక సమావేశంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వర్క్ షాపుకి పక్కనే ఉండి కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి డుమ్మా కొట్టడం ఇద్దరి మద్యా గ్యాప్ బాగా పెరిగిందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల టిడిపి నుంచి వైసీపీలో చేరిన గంజి చిరంజీవికి ఈ సారి మంగళగిరి వైసీపీ టికెట్ ఇస్తున్నారని, మంగళగిరి సీటు ఇచ్చేది లేదని తేల్చేయడంతోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి అలిగారని వైసీపీకి చెందిన మీడియా సంస్థలలో కథనాలు రావడంతో ..జరుగుతున్నది ప్రచారం కాదు వాస్తవమేనని తేలిపోయింది. ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశానికి ఎందుకు వెళ్లలేదంటే పంటికి చికిత్స చేయించుకున్నానని ఓ మాట, తన కొడుకు పెళ్లి అయ్యాక 16 రోజుల పండగ వల్ల వెళ్లలేదని మరో మాట చెప్పడం అనుమానాలకు మరింత ఊతం ఇస్తోంది. మరోవైపు సీఎం ఇంటి పక్కనే ఉన్న నియోజకర్గంలో ఇసుక, గ్రావెల్ మాఫియాతో వందల కోట్లు ఆళ్ల రామకృష్ణారెడ్డి దోచేశారని, దీనిపై సీఎం నిలదీశారని, ఆ కోపంతోనే వైసీపీతో అంటీముట్టనట్టు ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి.
జగన్ రెడ్డికి దూరమైన ఆళ్ళ రామకృష్ణా రెడ్డి..మంగళగిరి సీటు లేనట్టే..బరిలో గంజి
Advertisements