ఎన్నికల ప్రచారం వేళ డబ్బులు వెదజల్లుతూ కొందరు వైకాపా నేతలు ప్రదర్శించిన అత్యుత్సాహంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైకాపా నుంచి గంగుల బ్రిజేంద్ర రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయన తరఫున శిరివెళ్లలో ప్రచారం చేస్తున్న కొందరు నేతలు ప్రజలపై డబ్బులు వెదజల్లారు. దీంతో నోట్లు ఏరుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసిన వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాలని స్థానిక తెదేపా నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వైకాపాకు చెందిన అన్వర్ బాషా, సలీం అనే వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
ఆలస్యంగా వెలుగుచూసిన ఈ వీడియోపై స్థానిక టీడీపీ నేతలు శిరివెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బు, మద్యం పంచుతూ వైసీపీ నేతలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీకి చెందిన అన్వర్ బాషా, సలీంలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రక్రియను వైసీపీ అభ్యర్థి బ్రిజేందర్‌రెడ్డి అపహాస్యం చేస్తున్నారని అఖిలప్రియ ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. బ్రిజేంద్ర రెడ్డి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్‌ను కోరతామని ఆమె తెలిపారు. ఆళ్లగడ్డ స్థానంలో వైసీపీ తరపున గంగుల బ్రిజేంద్ర రెడ్డి, టీడీపీ తరపున భూమా అఖిలప్రియ పోటీచేస్తున్నారు.