చివరి కేంద్ర బడ్జెట్ చూసిన తరువాత కూడా, ఇంకా బీజేపీని వెనకేసుకుని వచ్చే వాళ్ళు ఉన్నారు అంటే, వాళ్ళు నిజంగా బానిసలే. రాష్ట్ర ప్రయోజనాల కంటే, ఊడిగం చెయ్యటమే వీళ్ళకు ఇష్టం. మొన్నటి దాక, కనీసం అరకోర నిధులు అయినా కేటాయించే వారు, ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. రాష్ట్రానికి చెందిన పలు ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఏపీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మాటల్లో చెబుతున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు... చేతల్లో మాత్రం ఆ ఉదారత చూపెట్టలేదు. పైగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలు చేశారు. రాష్ట్ర హక్కులు, హామీల అమలు కోసం అధికార టీడీపీ సహా రాజకీయ పార్టీలు చేస్తున్న ఆందోళనలను కేంద్రం తన బడ్జెట్‌ రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోలేదు.

modi 02022019

ఫలితంగా 2019-20 మధ్యంతర బడ్జెట్‌ ప్రసంగంలో కనీసం ఆంధ్ర ప్రదేశ్‌ ప్రస్తావనే లేదు. పెండింగ్‌ ప్రాజెక్టులపై ఊసే ఎత్తకపోగా... ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులకూ నిధులు కేటాయించలేదు. నూతన రాజధాని అమరావతి... దుగరాజుపట్నం.. కడప స్టీల్‌ ప్లాంట్‌... విశాఖ రైల్వే జోన్‌ వంటి ప్రాజెక్టుల గురించి బడ్జెట్‌లో ప్రతిపాదనలే లేవు. మరీ ముఖ్యంగా గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ నిఽధులపై కేంద్రం నుంచి స్పందన లేదు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు వడ్డీ రాయితీలు ఇవ్వాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉంది. గతేడాది ఈ మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి రూ. 100 కోట్లు కేటాయించారు. కానీ ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.

modi 02022019

ఇక విద్యాసంస్థల విషయానికి వస్తే, మనం ఈ దేశంలో భాగమేనా అనే అనుమానం కలుగుతుంది. కేంద్రియ విశ్వవిద్యాలయానికి రూ. 13 కోట్లు, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీకి(ఐఐపీఈ) రూ. 31.82 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల గిరిజన విశ్వవిద్యాలయం కోసం ఉమ్మడిగా రూ. 8 కోట్లు కేటాయించారు. ప్రతిష్ఠాత్మకమైప ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌), ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐఐఎ్‌సఈఆర్‌)లకు ఒక్క రూపాయి కూడా కేటాయింపులు చేయలేదు. ఈ రకమైన కేటాయింపులు చేస్తే విద్యాసంస్థలు అందుబాటులోకి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో, మోడీ గారే చెప్పాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read