వైసీపీ నేత ఆమంచి క్రిష్ణమోహన్ అంటే బాగా ఫేమస్. దౌర్జన్యాలకు కేరాఫ్ అడ్రస్ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి. అధికారులని సైతం బెదిరించడంలో అధికారం కూడా అక్కర్లేని దౌర్జన్యకర నేత అని టిడిపి విమర్శలు. ఇటీవల కాలంలో ఆనం మౌనంగా ఉంటూ వచ్చారు. కోర్టుపై వ్యాఖ్యలు చేయడంపై ఓవైపు దర్యాప్తు, మరోవైపు తన అడ్డా చీరాలలో టిడిపి నుంచి వచ్చిన ఎమ్మెల్యే కరణం బలరాం పెత్తనంతో డిస్ట్రబ్ అయ్యారు. అయితే పర్చూరు వైసీపీ సమన్వయకర్తగా బాద్యతలు అప్పగించడంతో మళ్లీ వార్తల్లోకెక్కారు ఆమంచి క్రిష్ణమోహన్. సాయంత్రం పర్చూరు వైసీపీ ఇన్చార్జిగా ప్రకటించిన సమాచారం తెలుసుకుని తెల్లారేసరికి నియోజకవర్గం మొత్తం శాఖల అధికారులు ఆమంచి ఇంట్లో వాలిపోయారు. బొకేలు తీసుకొచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు ఇంతగా బెదిరిపోయి మరీ లొంగి పోవడానికి కారణం ఆమంచి తీరేనని బాహాటంగా వినిపిస్తోంది. ఆమంచిది పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యేకాదు, ఇంకే అధికారిక పోస్టూ లేదు. కానీ అన్నిశాఖల అదికారులు ఆయన దర్శనం చేసుకోవాల్సి వచ్చింది. అదీ ఆమంచి స్టైల్ పాలిటిక్స్.
ఆమంచి మంచి తనానికి అధికారులు భయపడ్డారా ?
Advertisements