చీరాల నియోజకవర్గంలో పరిస్థితులకు అనుగుణంగా ఆగమేఘాలపై పోలీసు అధికారులను బదిలీ చేయటం విశేషం. పోలీసు యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని తప్పుడు కేసులతో తమను వేధించారని స్థానిక తెలుగుదేశం శ్రేణులు పార్టీ అధిష్టానంకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే అక్కడి అధికారుల బదిలీకి శ్రీకారం పలికారు. బుధవారం రాత్రే ఇద్దరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేసి కొత్తవారిని నియమించారు. గురువారం ఉదయం తొలిగంటలోనే డీఎస్పీ బదిలీ జరిగింది. ఎమ్మెల్యే ఆమంచి సిఫార్సుతో సుమారు ఆరునెలల క్రితం శ్రీనివాసరావు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అతనిని మార్చి నాగరాజుని డీఎస్పీగా నియమించారు.

amanchi 152019

తొలిరోజుల్లో చీరాల ఎస్‌ఐగా కూడా పనిచేసి ఆ ప్రాంతంపై ప్రత్యేక అవగాహన ఉన్నందునే తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్న నాగరాజుని చీరాలకు బదిలీ చేసినట్లు భావిస్తున్నారు. రెవెన్యూ శాఖలో కూడా కొన్ని బదిలీలకు శ్రీకారం పలికారు. మున్ముందు ఆమంచి యంత్రాంగం అండతో వ్యవహారాలు సాగించకుండా కట్టడి చేసే లక్ష్యంతోనే ఈ బదిలీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చంద్రబాబుని కలిసిన సందర్భంలో కూడా తనపై ఉన్న ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసులు సహా మొత్తం 20 కేసులను ఎత్తివేయాలని ముఖ్యమంత్రిని ఆమంచి కోరారని తెలిసింది. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో తనపై పెరిగిపోయిన వ్యతిరేకత మూలంగా ఓటమి ఎదురైతే అప్పుడు కేసులు ఇబ్బంది పెడతాయి కాబట్టి ఇప్పుడే వాటి ని ఎత్తేయించుకోవలని ఆమంచి ప్రయత్నించారు.

amanchi 152019

అయితే కేసులు ఎత్తేయడం కుదిరే పని కాదు కాబట్టి సీఎం సున్నితంగా ఆమంచి డిమాండు ను తోసి పుచ్చారని సమాచారం. పైగా ఇప్పటికైనా రౌడీయిజాన్నీ మానుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని సీఎం హెచ్చరించినట్లు తెలిసింది. దాంతో నియోజకవర్గంలో తన విచ్చలవిడితనానికి తన రౌడీయిజానికి సహకరించట్లేదని తెలుగుదేశాన్ని వీడి వైసీపీలో చేరారు. తన అన్న కొడుకు మీద కేసు పెట్టించిన దగ్గుబాటి చేరిన గూటిలోనే ఆమంచి కూడా చేరారు. ఈ విషయంపై ఆయన కుటుంబంలో అభిప్రాయ భేదాలు వచ్చినట్టు తెలుస్తుంది. తన కుమారుడిపై కేసు పెట్టిన దగ్గుబాటి తో ఎలా కలిసి పనిచేస్తామని ఆమంచి కృష్ణమోహన్ అన్న స్వాములు ప్రశ్నించినట్టు సమాచారం. ఆమంచి ఎమ్మెల్యేగా ఉన్న పదేళ్ల కాలంలో పోలీసులను చేతిలో పెట్టుకొని అక్రమాలు చేసిన కృష్ణమోహన్ తెలుగుదేశం పాలనలో పోలీసుల తన మాట వినడం లేదని వైసీపీలోకి వెళ్లిపోయారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read