పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. ఈ రోజు రాజీనామా లేఖను ఆయన సోనియా గాంధీకి పంపించారు. రాజీనామాకు దారి తీసిన కారణాలు అన్నీ ఆ లేఖలో రాసారు. అలాగే తాను కొత్త పార్టీ పెడుతున్నట్టు, ఆ పార్టీ పేరు కూడా ఆ లేఖలో తెలిపారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా, ఆయన లేఖలో రాసిన కొన్ని అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాసిన రాజీనామా లేఖలో చంద్రబాబు ప్రస్తావన ఉంది. ఇంతకీ ఆయన రాజీనామా లేఖలో ఏమి రాసారు అంటే, తాను ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో, 92% వరకు ఎలక్షన్ హామీలు నెరవేర్చినట్టు చెప్పారు. అక్కడితో ఆగలేదు. అప్పటి వరకు ఆ రికార్డు నారా చంద్రబాబు నాయుడు పేరు మీద ఉందని, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఎన్నికల హామీల్లో భాగంగా 87% హామీలు నెరవెర్చారని, అప్పటి వరకు ఆ రికార్డు చంద్రబాబు పేరు మీద ఉండేదని, తాను 92% వరకు ఎన్నికల హామీలు నెరవేర్చాను అంటూ లేఖలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత 87% నెరవెర్చారని, ఈ రికార్డు అనేది ఇప్పటి వరకు చంద్రబాబు పేరు మీద ఉండేది అంటూ ఆ లేఖలో తెలిపారు.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా లేఖలో, చంద్రబాబు గురించి ఇంత గొప్పగా రాయటం చూసి తెలుగుదేశం శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. తాము ప్రభుత్వంలో ఉండగా, కేవలం అభివృద్ధి సంక్షేమం మీదే శ్రద్ద పెట్టామని, చేసిన పనులు కూడా ప్రజలకు చెప్పుకోలేదని, ప్రజలు అన్నీ గమనిస్తారు అనుకున్నాం కానీ, వైసీపీ మాయాలో ప్రజలు పడి, తాము ఏమి చేయలేదు అనే అభిప్రాయానికి వచ్చారని, కానీ వాస్తవం వేరని, ఇప్పుడు తాజాగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాసిన ఈ లేఖే సాక్ష్యం అని చెప్తున్నారు. 200 పెన్షన్ ని పది రెట్లు పెంచి 2000 చేసామని, అలాగే రుణ మాఫీ 50 వేలు లోపు అందరికీ చేసామని, 50 వేల పైన ఎన్నికల కోడ్ వచ్చిందని, అలాగే విద్య, వైద్యం, అన్న క్యాంటీన్లు, ఇలా ఒకటి కాదు రెండు కాదని, ఎన్నికల్లో చెప్పినవి కాకుండా, చెప్పనవి కూడా చేసాం అని, అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారంతో, ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టక, తాము వెనుక పడినా, ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారని అంటున్నారు.