చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మకమైన కంపెనీ అమరరాజా కంపెనీ. ఇక్కడ దాదాపుగా పది వేల మంది వరకు పని చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఈ కంపెనీతో అనేక మందికి రిలేషన్ ఉంటుంది. అయితే ఈ కంపెనీ తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ది కావటంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ కంపెనీ పైన కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. దానికి తగ్గట్టే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో, ఏకంగా అమరరాజా కంపెనీ మూసి వేయించాలని ప్రభుత్వం, ఆదేశాలు జారీ చేసింది. ముఖ్య కారణంగా, అక్కడ గ్రామస్తులు, అలాగే ఉద్యోగుల రక్తంలో లెడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుందనే ఆరోపణలు చేసారు. దీని పైన అమరరాజా కంపెనీ కోర్టుకు వెళ్ళింది. ప్రభుత్వ నోటీసులు పైన స్టే ఇచ్చిన హైకోర్టు, ప్రభుత్వాన్ని బ్లడ్ సంపుల్స్ ఇవ్వమని అడిగింది. అయితే నెలలు గడుస్తున్నా, ప్రభుత్వం ఆ నివేదిక ఇవ్వటానికి ఎందుకో సాకులు వెతుక్కుంటుంది. హైకోర్టు వార్నింగ్ ఇచ్చినా, నిన్న జరిగిన వాయిదాలో, రిపోర్ట్ ఇంకా రాలేదని చెప్పారు. దీంతో అమరరాజా తరుపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేసారు. ప్రభుత్వం కావాలనే ఇలా చేస్తుందని, కావాలనే తమను ఇరికించే ప్రయత్నంలో భాగంగానే తప్పుడు రిపోర్ట్ లు సృష్టించే పనిలో పడింది అంటూ, కోర్టు ముందు వదానలు వినిపించారు.

hc 26012022 2

ప్రభుత్వ తరుపు న్యాయవాది, ఈ రిపోర్ట్ లను ఐఐటి మద్రాస్ వారు ఇవ్వాల్సి ఉందని, అయితే కోవిడ్ కారణంగా, ఇప్పటి వరకు కుదరలేదని, అందుకే ప్రైవేటు సంస్థలతో టెస్ట్ రిపోర్ట్ లు చేపిస్తున్నాం అని చెప్పగా, అమరరాజా తరుపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేసారు. రాష్ట్రం బయట ఉన్న సంస్థలతోనే రిపోర్ట్ తయారు చేపించాలని, ప్రభుత్వం తమ పైన కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందని తెలిపారు. అయినా దాదాపుగా ఏడాది కావస్తున్నా, ఇప్పటి వరకు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వక పోవటం వెనుక, అక్కడ ఏమి లేదని తేలటంతోనే, ప్రభుత్వం తప్పుడు నివేదకలు కోసమే, జాప్యం చేస్తుందని కోర్టు ముందు వాదించారు. దీంతో హైకోర్టు, వచ్చే వాయిదాకి తమ ముందు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలని, లేని పక్షంలో కేసు మెరిట్స్ ఆధారంగా తాము నిర్ణయం ప్రకటిస్తాం అంటూ, కేసుని వాయిదా వేసింది. అయితే ప్రభుత్వం ఈ విషయంలో ఇరుకున పడిందా అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అమరరాజాకి వ్యతిరేకంగా ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోవటంతోనే, ప్రభుత్వం వెనకడుగు వేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read