అమరావతి ఆందోళన 150 వ రోజు జరుగుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్ట్ షాక్ ఇచ్చింది. రాజధాని అమరావతి కోసం, అని రైతులు ఇచ్చిన భూములను, తమ రాజకీయం కోసం ఇళ్లస్థలాలకు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల పై ఏపీ హైకోర్టు శుక్రవారం నాలుగు వారాలు స్టే ఇచ్చింది. ఈ కేసుపై తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసింది. రాజధాని బృహత్ ప్రణాళిక ప్రకారం ఇప్పటి వరకు నాలుగు నివాస జోన్లు ఉండేవి, మాస్టర్ ప్లానును అనుసరించి ఇంత వరకు ఇప్పటికే వున్న గ్రామాలను ఆర్-1గాను, తక్కువ సాంద్రాత గృహాలను ఆర్-2గాను, తక్కువ నుంచి మధ్యసాంద్రత కలిగిన గృహాలను ఆర్-3లోను వుంచి మూడు జోనులుగా, హైడెన్సివ్ గా ఆర్- 4జోన్లు ఉన్నాయి. అయితే, రాజధానిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు,కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా బదలాయిస్తూ ఇటీవల ప్రభుత్వం ప్రకటన జారీచేసింది.
ఇందులోని 900.97 ఎక రాలను ఆర్-5 జోన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దీనిపై అమరావతి గ్రామాని చెందిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దానిమీద కేసును ప్రాథమికంగా విచారించిన హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులపై నాలుగువారాల ఇంటిరీయమ్ స్టేను జారీ చేసింది. ఈ కేసులో పిటిషనర్లు తరుపు న్యాయవాదులు మాస్టర్ ప్లాన్‌లో మార్పు చేయాలంటే ప్రజాభిప్రాయ సేకరణ తప్పని సరి అని వాదించారు. తదువరి ఆదేశాలు ఇచ్చే దాకా భూములు అమ్మిన రైతులకు డబ్బు చెల్లించవద్దని ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాలోని ఇళ్ల పట్టాల కోసం కొనుగోలు చేసిన భూముల్లో అక్రమాలు జరిగాయంటూ ఏవీ హైకోర్టులో పబ్లిక్ లిటిగేషన్ పిటీషన్ దాఖలయ్యింది. 600 ఎకరాల భూమి కొనుగోలులో అవినీతి జరిగింది అంటూ బూరుగుపూడికి చెందిన రైతు ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసారు. ఆ పిటిషన్ శుక్రవారం హైకోర్టులో విచారణ చేపట్టారు. హైకోర్టు దీనిపై ప్రాథమిక విచారణనంతరం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కోర్టు తదుపరి ఆదే శాలు ఇచ్చేవరకు భూములు అమ్మిన రైతులకు డబ్బులు చెల్లించవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఈ ఉత్తర్వులో స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని బూరుగు పూడిలో ఎకరం రు.7.20లక్షలు విలువచేసే భూమికి ప్రభుత్వం రు. 45 లక్షలు చెల్లించిందని రైతు వ్యాజ్యంలో ఆరోపించారు. ముంపు భూములు కొనుగోలు చేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారన్నారు. సదరు భూమి కొనుగోలులో 6 రెట్లు అధికంగా చెల్లించారని పిటీషనర్ తరపు న్యాయవాది బి.ఎస్. ఎన్.వి.ప్రసాద్ బాబు కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. అధికారులు, నాయకులు కలసి కుమ్మక్కై ప్రజాధనం దుర్వినియోగం చేసారని, అక్కడ ఉన్న గుంతలు పూడ్చాలంటే వందల కోట్లు ఖర్చుచేయాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు.