ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఎటు వైపు చూసినా కష్టాలే కనిపిస్తున్నాయి. నిన్నటి దాక, అక్కడ పనులు ఆపమని ఆదేశాలు వచ్చాయని, అక్కడ పని చేసిన వారందరూ వెళ్ళిపోతున్నారు అనే వార్తలు చూసాం. ఇలాంటి వార్తలు అమరావతి ప్రేమికులకు నిజంగా చేదు వార్తే. జగన్ ఎప్పుడు రివ్యూ చేస్తారా, మళ్ళీ అమరావతి పనులు ఎప్పుడు మొదలు అవుతాయా అని అందరూ ఎదురు చూస్తున్న టైంలో, అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది అనే వార్తలు ఇప్పుడు మరింత బాధిస్తున్నాయి. అమరావతి నిర్మాణ కంపెనీలో ఒకటైన మేఘా ఇంజనీరింగ్ కంపెనీలో మంగళవారం అర్ధరాత్రి 11 గంటలకు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాజధాని రైతుల ఫ్లాట్ల లేఅవుట్‌లో అభివృద్ధి పనుల నిమిత్తం ఉంచిన దాదాపు రెండు కోట్ల విలువ చేసే ప్లాస్టిక్ పైపులు ఈ ప్రమాదంలో దహనమైనట్టు తెలిసింది. ప్రాణనష్టం జరగలేదని అక్కడ ఉన్న కొంత మంది కార్మికులు తెలిపారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు మేఘా కంపెనీ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. అయితే మంటలు ఎలా అంటుకున్నాయి అనే విషయం పై మాత్రం, ఇంకా క్లారిటీ రాలేదు.
అర్ధరాత్రి, అమరావతి నిర్మాణ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం
Advertisements