అమరావతిలో అరచాకలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఎప్పటిలా ప్రభుత్వం కాకుండా, ఈ సారి కొంత మంది దుండగులు ముసుగులో వచ్చి ఈ అరాచకం చేసారు. పది రోజులు క్రితం, అమరావతి రాజధానిని కలిపే ఐకానిక్ బ్రిడ్జికు సంబంధించి, మొదలు పెట్టిన పనులను, ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ధ్వంసం చేయటానికే వారం రోజులు పట్టింది అంటే, అంత గట్టిగా అక్కడ నిర్మాణ పనులు జరిగాయి. అయితే ఇది ఇలా ఉంటే, నిన్న రాత్రి మరోసారి అమరావతిలో అరాచకం జరిగింది. అమరావతి రాజధాని శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయినిపాలెంలో ఈ అరాచకం చోటు చేసుకుంది. గత చంద్రబాబు ప్రభుత్వం, ముందుగా మౌళిక వసతులు కోసం అని చెప్పి, దాదాపుగా అన్ని ఇంటర్నల్ రోడ్డులు పూర్తి చేసింది. ఇదే క్రమంలో ఉద్దండరాయినిపాలెంలో ఎన్ 10 రహదారి నిర్మాణం కూడా జరిగింది. 165 మీటర్ల వెడల్పుతో ఈ రోడ్డు నిర్మాణం జరిగింది. అయితే నిన్న అర్ధరాత్రి కొంత మంది దుండగులు, జేసీబీలు వేసుకొచ్చి ఆ రోడ్డును తవ్వటం మొదలు పెట్టారు. అయితే ఇది గమనించిన ఉద్దండరాయినిపాలెం రైతులు, ఘటన జరిగిన ప్రాంతానికి పరుగులు పెట్టారు. వెంటనే సమాచారం గ్రామం మొత్తం పాకటంతో, అందరూ అక్కడకు వెళ్ళారు. అయితే వీళ్ళ రాకతో, జేసీబీతో పాటుగా, అక్కడ ఉన్న టిప్పర్ కూడా అక్కడ నుంచి జారుకున్నారు.
అయితే ఈ రోజు ఉదయం రాజధాని రైతులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించిన రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ దుండగులు ఎవరో పోలీసులు పట్టుకోవాలని అన్నారు. అధికార పార్టీ వారే ఈ అరాచకం చేసారని, ప్రభుత్వ సపోర్ట్ లేకుండా, ఇంత ధైర్యంగా రోడ్డును తవ్వేసే సహసహం ఎవరూ చేయరని, దీని వెనుక కచ్చితంగా ప్రభుత్వ హస్తం ఉంది అంటూ ఆరోపిస్తున్నారు. అమరావతిని నాశనం చేస్తున్నారని, ఒక పక్క రాష్ట్రంలో రోడ్డులు అన్నీ నాశనం అయి ఉంటే, ఇక్కడ బాగున్న రోడ్డు కూడా తవ్వటం ఏమిటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి, అసలు ఈ ఘటన ఎవరు చేసారు, ఎందుకు చేసారు అనే విషయం ప్రజలు చెప్పాలని అంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు అక్కడ నిరసన తెలిపారు. అమరావతి పై కక్ష కట్టారని, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని, అమరావతి నాశనమే అజెండాగా పెట్టుకుని, రైతులును క్షోభ పెడుతున్నారని వాపోయారు.