నిత్యం అబద్ధాలతో, గోబెల్స్ ప్రచారం చేస్తున్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుతో పాటు, బీజేపీ నాయకులకు, ప్రతి సారి ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు గట్టి జర్క్ ఇస్తూ ఉంటారు. అబద్ధాలను, నిజాలు చెయ్యటంతో దిట్ట ఈ జీవీఎల్. అందుకే మొన్న రాజ్యసభలో, టీఎంసీ ఎంపీ ఒబ్రియాన్ మాట్లాడుతూ, ఢిల్లీలో జీవీఎల్ కు ఆధార్ కార్డు ఉంది, ఆయన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు అంటూ, జీవీఎల్ గాలి తెసేసారు. జీవీఎల్ నరసింహారావు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే, ఒక్కటి కూడా నిజం ఉండదు. ఇలాంటి తియ్యని అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టే, ఇతన్ని రాజ్యసభలో కూర్చోబెట్టాడు అమిత్ షా..
అయితే, ప్రతిసారి రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు కుటుంబరావు చేతిలో ఫూల్ అవుతున్న జీవీఎల్, ఆయన్ను ఎలా ఎదుర్కోవాలో తెలియక, ఆయన పై వ్యక్తిగత దూషణలకు దిగటం మొదలు పెట్టాడు. కుటుంబరావు గారు, ఇది వరకు స్టాక్ మార్కెట్ లో పని చేసేవారు. అది పట్టుకుని, కుటుంబరావుని "స్టాక్ బ్రోకర్" అంటూ వెటకారం చెయ్యటం మొదలు పెట్టాడు జీవీఎల్. అయితే ఇప్పుడు ఈ "స్టాక్ బ్రోకర్" పర్యవేక్షణలో జరిగిన అమరావతి బాండ్స్ సూపర్ హిట్ అయ్యాయి. సిఆర్డీఏ అధికారుల కృషి, కుటుంబరావు సలహాలతో, అమరావతి బాండ్స్ స్టాక్ ఎక్స్చేంజి ని షేక్ చేసాయి.
1300 వందల కోట్ల పెట్టుబడి ఆకర్షించాలి అన్న టార్గెట్ తో విడుదల అయిన అమరావతి బాండ్లు...విడుదల అయిన గంటలో 2000 కోట్ల పైగా పెట్టుబడులు వచ్చాయి... గంట వ్యవధిలోనే ఒకటిన్నర రెట్లు అదనంగా సబ్‌స్ర్కైబ్ అయ్యాయి.. అమరావతి బాండ్ల పట్ల మదుపరుల నమ్మకం చూరగొనడానికి విస్తృత ప్రచారం నిర్వహించారు. ముంబయిలో సమావేశాలు నిర్వహించారు. మదుపరులు పెట్టే అసలుకి, వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. 10.32 శాతం వడ్డీ కూడా ఆకర్షణీయంగా ఉండటంతో మదుపరుల్ని ఈ బాండ్లు బాగా ఆకర్షించాయి. జీవీఎల్ ఎగతాళి చేస్తున్న ఈ "స్టాక్ బ్రోకర్" అమరావతికి ఇంత సహాయం చేసాడు, మరి జీవీఎల్ ఏమి చేసాడు అని ప్రశ్నిస్తే ?