అమరావతి బాండ్ల క్రయ విక్రయాల ప్రస్థానంలో మరో కీలక అడుగు పడింది. రాజధాని బాండ్లకు రికార్డు స్థాయి డిమాండ్‌ను, భారీ నిధులు సాధించిన నవ్యాంధ్రప్రదేశ్ ఈ బాండ్లను బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో లిస్టింగ్ చేసింది. ఆర్థిక రాజధాని ముంబైలో కోలాహలంగా సాగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఉదయం సెరిమోనియల్‌ బెల్‌ మోగించి లిస్టింగ్‌ను ప్రారంభించారు. "ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు మంచి అనుకూల వాతావరణం.. మా మీద ఉన్న విశ్వాసం నమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ఇందుకు అమరావతి అభివృద్ధి బాండ్ల ద్వారా పెట్టుబడులే తాజా ఉదాహారణ" అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ ఆర్థిక రాజధానిగా పేరుగన్న ముంబై లో పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు.

bse 27082018 2

బీఎస్ఈ లో సీఆర్డీఏ కి చెందిన అమరావతి బాండ్ల లిస్టింగ్ బెల్ మోగించిన ముఖ్యమంత్రి పలువురు ఇన్వెస్టర్లను ఉద్దేశించి ప్రసంగించారు. సులభతర వాణిజ్యానికి అనువుగా ఉన్న రాష్ట్రంగా గ్లోబల్ గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడితే అటు పెట్టుబడిదారులకు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా చాల ప్రయోజనమని ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్ కు తాను చేసిన అభివృద్ధి ద్వారా ఒక మంచి పేరు తెచ్చి పెట్టగలిగామని, అలాగే అమరావతి ని మరింత పెద్ద ఎత్తున అభివృద్ధి చేయతలపెట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆధునిక సాంకేతికతను రాష్ట్ర అభివృద్ధితో జోడించడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తున్నామని ఆయన అన్నారు.

bse 27082018 3

ఆంధ్రప్రదేశ్ లో ఇన్నోవేషన్ కేంద్రాంనొకదానిని ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి బీఎస్ఈ అధికారులను కోరారు. సృజనాత్మక విధానాలదే భవిష్యత్ అని దాని ద్వారానే అనేక కొత్త కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తూ జ్ఞాన భూమిగా మారుస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రియల్ టైం గవెర్నెన్స్ రాష్ట్ర పాలన లో ఒక కీలక భూమిక పోషిస్తోందని, సమర్థ ఆర్థిక నిర్వహణ, ఈ-ఆఫిస్, కంటెంట్ కార్పొరేషన్ వంటి వినూత్న ఆవిష్కరణలు రాష్ట్ర పరిపాలనలో ఒక కొత్త ఒరవడి సృష్టించాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read