అమరావతికి రుణం ఇవ్వాద్దు అంటూ తాజాగా కెనడాకు చెందిన ఓ ఎన్జీవో సంస్థ, ప్రపంచ బ్యాంకుకు లేఖ రాసిన సంగతి ఇవాళ వార్తల్లో చూసి ఆశ్చర్యపోయారు ప్రజలు... ఒక పక్క ఇక్కడ రైతుల పేరిట ఇప్పటికే ప్రపంచ బ్యాంకుకి లెటర్లు రాసిన వారు, ఇప్పుడు ఏకంగా విదేశాల నుంచి మన అమరావతి పరువు తీస్తున్నారు... అయితే ఇప్పుడు ఈ కెనడా ఎన్జీవో సంస్థ వెనుక, అందరూ అనుకుంటున్నట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లింక్ బయటపడింది... నడా ఎన్జీవో సంస్థ వెనుక ఎవరు ఉన్నది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ మంత్రి నక్కా ఆనందబాబు బయట పెట్టారు...
కెనడా ఎన్జీవో సంస్థ వెనుక ఉంది కధ అంతా నడిపించింది, జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్ అని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు... మతం పేరుతో రాజకీయాలు లు మానుకోవాలని బ్రదర్ అనిల్ కుమార్, జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చారు... రాష్ట్ర అభివృద్ధి ని సైందవుడిలా జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు అని అన్నారు. రైతుల స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణం కోసం 34 వేల ఎకరాలు ఇస్తే, స్విస్ ఛాలెంజ్ పద్దతిలో ప్రపంచ రాజధాని నిర్మాణం చేపట్టడం జరిగితే, అమరావతి రాజధాని లో నిర్మాణం ఇష్టంలేని జగన్మోహన్ రెడ్డి ఇన్ని కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో పర్యఠించిన బిల్ గేట్స్, రాష్ట్రపతి రామ్ నాద్ కొవింద్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి , టెక్నాలజీ ని చూసి అభినందించారని, జగన్ మాత్రం మారటం లేదు అని అన్నారు..
ఉదయం నుంచి ఈ వార్తా వింటున్న వారికి, అమరావతి నిర్మాణం ఆపటానికి కెనడాలో ఉన్న సంస్థ అడ్డుకోవటం ఏంటో అర్ధం కాలేదు... కెనడాకి, అమరావతికి ఎక్కడా లింక్ కుదరలేదు... జగన్ పార్టీ పై అనుమానం ఉన్నా, వివరాలు లేక ఎవరూ మాట్లాలేదు... జగన్ బావ బ్రదర్ అనిల్, తనకు ఉన్న మతపరమైన పరిచయాలతో, అక్కడ నుంచి ప్రపంచ బ్యాంకు కు ఫిర్యాదు చేసినట్టు, ప్రభుత్వంలోని పెద్దలు అంచనాకి వచ్చారు... పూర్తి వివరాలు సేకరించి, ప్రజల ముందు ఉంచటానికి రెడీ అయ్యారు... కెనడా నుంచి అయితే, ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల మీద ఒత్తిడి తేవచ్చు అని జగన్ భావించి, బ్రదర్ అనిల్ పరిచయాలు వాడి ఉంటారు అని అంటున్నారు..