టీవీ 3*3 తన స్వామిభక్తిని చాటుకునేందుకు అతి పెద్ద దుస్సాహసానికి ఒడిగట్టింది. వైసీపీ సర్కారు ఇప్పటికే అవాస్తవాలు, అసత్యాలు ప్రచారం చేస్తోంది. రేటింగులోనూ నెంబర్ వన్ స్థానం నుంచి పడిపోయినా ఫేక్ ప్రాపగండా మానడంలేదు. బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా లైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సడెన్గా బ్రేకింగ్ న్యూస్ వేసింది. ``విశాఖ రాజధానికి లైన్ క్లియర్, రాజధానిపై నిర్ణయం ప్రభుత్వానిదేనన్న సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే`` అంటూ టీవీ 3*3 సుప్రీంకోర్టు తరఫున తీర్పు ఇచ్చేసింది. ఇది పదేపదే ప్రసారం చేసిన ఓ ఐదు నిమిషాల తరువాత ఆపేశారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు మనం ఎలా మిస్సయ్యాం అని మిగిలిన చానల్ వాళ్లు ఉరుకు పరుగులు పెట్టారు. అయితే అసలు విషయం తెలిసి షాక్ తిన్నారు. అటు సీబీఐ తాడేపల్లి కాంపౌండ్ పై దృష్టి పెట్టడం, ఇటు ఎన్ఐఏ కోడికత్తి కేసు, మరో వైపు ఫోన్ ట్యాపింగ్ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తాత్కాలిక ఆనందం కలగజేసేందుకు ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం పేరుతో తప్పుడు తీర్పులు ఇచ్చేసి ప్రసారం చేశారు. వాస్తవంగా ఈ రోజు సుప్రీంకోర్టులో రాజధాని కేసులు విచారణ కోసం లిస్టు కాలేదు. మూడు రాజధానుల కేసుపై ఫిబ్రవరి 7న సుప్రీం కోర్టు విచారించనుంది. అయితే సుప్రీంకోర్టు పేరుతో ఇలా తప్పుడు తీర్పులు వెలువరించడం తీవ్రమైన నేరంగా పరిగణించాలని న్యాయకోవిదులు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున దుమారం రావటంతో, టీవీ 3*3లో, ఆ వార్త తప్పు అంటూ ఖండన ఇచ్చారు.
అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పు అంటూ ఫేక్ చేసిన టివి 3*3.. వైసీపీ కళ్లలో ఆనందం కోసమేనా?
Advertisements