జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రాజధానిని, మూడు ముక్కలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో ఆశలతో కొత్త రాజధాని వస్తుంది, దేశంలో మనకు కూడా ఒక గొప్ప సిటీ స్థానం దక్కుతుంది, అనుకున్న ఆంధ్రులకు మూడు ముక్కల రాజధానితో, భంగపాటు ఎదురైంది. రెండున్న ఏళ్ళు అయ్యింది, ఏ రాజధాని లేకుండా పోయింది. అమరావతి లేదు, వైజాగ్ లేదు, కర్నూల్ లేదు. ఎక్కడా ఏమి లేదు. కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి కానీ, అక్కడా నిర్మాణాలు అయితే జరగటం లేదు. ఆంధ్రుల అడ్రస్ ఎక్కడో ఇప్పటికీ తెలియకుండా పోయింది. చెన్నై నుంచి, కర్నూల్ నుంచి, హైదరాబాద్ నుంచి, అమరావతి నుంచి, ఇప్పటికీ అడ్డ్రెస్ వెతుకుతూనే ఉన్నాం. ఇది పక్కన పెడితే, విభజనతో రోడ్డున పడ్డ ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం, అప్పటి ప్రభుత్వం పిలుపు మేరకు, పొలాలు ఇచ్చిన రైతన్నలు, అక్కడ ఒక అద్భుతమైన రాజధాని వస్తుందని, రాష్ట్రంతో పాటుగా, తాము కూడా బాగుపడతాం అని అనుకున్నారు. అయితే , అమరావతిని మూడు ముక్కలు చేయటంతో, వారి కలలు చెదిరిపోయాయి. భూములు ఇచ్చి నష్టపోయిన రైతులు, ప్రజాస్వామ్య పోరాటం చేయటమే కాకుండా, న్యాయ పోరాటం వైపు కూడా అడుగులు వేసిన సంగతి అందరికీ తెలిసిందే.

amaravati 21082021 2

హైకోర్టులో అనేక పిటీషన్లు దాఖలు అయ్యాయి. అయితే గతంలో చీఫ్ జస్టిస్ గా ఉన్న మహేశ్వరి నేతృత్వంలో, ఈ పిటీషన్ల పై విచారణ జరిగింది. కేసు చివరి దశలో ఉండగా, ఆయన బదిలీ కావటంతో, కేసు మళ్ళీ మొదటికి వచ్చింది. కొత్త చీఫ్ జస్టిస్ గోస్వామి రావటంతో, ఈ కేసులు విషయం పై, ఆయన ఏమి నిర్ణయం తీసుకుంటారా అని అందరూ భావించారు. అయితే ఆయన ఈ కేసులు విషయం పై మొదటి నుంచి మళ్ళీ వాదనలు వింటాం అని చెప్పారు. తరువాత క-రో-నా సెకండ్ వేవ్ రావటంతో, ఈ కేసులు విచారణ ఆగష్టు 23కి వాయిదా పడింది. సోమవారం నుంచి ఈ కేసులు విచారణ ప్రారంభం అవుతాయి. దీంతో ఫుల్ బెంచ్ ఏర్పాటు చేసారు చీఫ్ జస్టిస్. సోమవారం నుంచి ప్రతి రోజు విచారణ జరగనుంది. ఇది ఇలా ఉంటే, విశాఖకు వెళ్ళిపోతాం, ముఖ్యమంత్రి ఎక్కడ నుంచి అయిన పని చేయవచ్చు అంటూ చెప్తున్న ప్రభుత్వం, ఇప్పటి వరకు తరలించ లేదు. మరో పక్క ఇప్పుడున్న ఆర్ధిక పరిస్థితి చూస్తే, ప్రభుత్వానికి విశాఖ తరలించే సీన్ లేదనే అర్ధం అవుతుంది. ఇక అమరాటి కేసుల విషయం సోమవారం నుంచి ఏమి అవుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read