ఒక పక్క అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రుల రాజధాని అమరావతిని వ్యంగ్యంగా, అది అమరావతి కాదు, భ్రమరావతి అని హేళన చేస్తుంది. అమరావతి ముందుకు సాగకుండా ప్రతి రోజు, అమరావతి పై ఏదో ఒక బురద చల్లుతూనే ఉంది. 2019 దాకా అమరావతిలో పది వేల కోట్లు ఖర్చు పెడితే, 2019లో జగన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. అమరావతి నెమ్మదిగా ఒక శిధిల నగరం అయిపొయింది. ఇది ఒక ఎత్తు అయితే, అమరావతిని కేవలం శాసన రాజధాని అంటూ, ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన ముందుకు తెచ్చింది. చెప్పేది మూడు రాజధానుల అయినా, అమరావతి, కర్నూల్ కు చేసేది ఏమి లేదని అందరికీ తెలిసిందే. దీని కోసం, అమరావతి పై రకరాకాలుగా బురద చల్లుతున్నారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు ఇందులో ఏదో చేసారు అంటూ, ఆయన పై సిఐడి కేసు నమోదు చేసారు. ఆధారాలు లేకుండా కేసులు పెట్టారు. ఇలా అమరావతి పై రాష్ట్ర ప్రభుత్వం, అన్ని విధాలుగా సవతి తల్లి ప్రేమ చూపిస్తుంటే, కేంద్రం మాత్రం అమరావతికి సై అంటుంది. అమరావతి అభివృద్ధి కోసం, వచ్చే 5 ఏళ్ళలో, ఆర్ధిక సంఘం సిఫారుసు మేరకు వెయ్యి కోట్లు నిధులు ఇస్తాం అంటూ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ ప్రకటన చేసారు.
15వ ఆర్ధిక సంఘం, రాష్ట్రంలో ఎనిమిది కొత్త నగరాలకు, 8 వేల కోట్లు సిఫారుసు చేసిందని, ఇందులో అమరావతి కూడా ఉందని, అమరావతి వచ్చే 5 ఏళ్ళలో వెయ్యి కోట్లు నిధులు, ఆర్ధిక సంఘం సిఫారసు మీది ఇస్తాం అని తెలిపారు. ఇది కూడా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా పార్లమెంట్ లో చెప్పారు. దీనికి సంబంధించి విధివిధానాలు త్వరలోనే చెప్తామని కేంద్రం ప్రకటించింది. అయితే కేంద్రం ఈ నిధులు ఇస్తుందా, ఇప్పటి వరకు ప్రకటించినవి ఇచ్చిందా అనే విషయం పక్కన పెడితే, ఇక్కడ అమరావతిని కొత్త నగరంగా గుర్తించటం,దానికి వెయ్యి కోట్లు నిధులు ఇవ్వటం, వైసీపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఒక పక్క అమరావతిని నిర్వీర్యం చేయాలని, అక్కడ రూపాయి ఖర్చు పెట్టినా దండగ అంటూ వైసీపీ నేతలు చెప్తుంటే, కేంద్రం మాత్రం ఇలా సహాయం చేస్తుంది. అయితే ఇది కేవలం కొత్త నగరాలకు అని వైసీపీ సమర్ధించుకుంటున్నా, ఇప్పటికీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన, కేంద్రం గుర్తించలేదు అనే విషయం, ఈ ప్రకటనతో అర్ధమవుతుంది.