అమరావతి అంటే చాలు అన్ని వైపుల నుంచి, విషం చిమ్మే ఒక జాతి మన రాష్ట్రంలో చేస్తున్న పనులు చూస్తూనే ఉన్నాం... మై బ్రిక్, మై అమరావతి అంటూ, 10 రూపాయలు పెట్టి ఇటుకలు కొనమని, తద్వారా ప్రజా రాజధానిలో భాగస్వామ్యం కావలి అని పిలుపిచ్చినా, దాని మీద కూడా పడి ఏడ్చిన సందర్భం చూసాం... మన రాష్ట్రంలో ఉన్న ఏంతో మంది సంస్కారహీనులు, ఈ పాపని చుసైనా బుద్ధి తెచ్చుకుంటారని ఆశిద్దాం... ఈ పాప పేరు అంబుల వైష్ణవి... ముదినేపల్లికి చెందిన ఈ బాలిక తొమ్మిదో తరగతి చదువుతుంది...

amaravati 30012018

అమరావతి మీద ఉన్న మమకారంతో, రాజాధాని నిర్మాణంలో తానూ భాగస్వామి కావాలని, తొమ్మిదో తరగతి చదువుతున్న వైష్ణవి సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి, రూ.లక్ష విరాళంగా విరాళం అందచేసింది... అలాగే, ముదినేపల్లిలో రెండు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నట్టు ముఖ్యమంత్రికి వైష్ణవి తెలిపింది... ఇప్పటివరకు రూ.4 లక్షలతో రెండు పాఠశాలలలో అభివృధ్ధి కార్యక్రమాలు చేపట్టింది వైష్ణవి...

amaravati 30012018

ఈ సందర్భంగా వైష్ణవిని ప్రత్యేకంగా అభినందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు... ఇలాంటి వారు మన రాజాదానికి అవసరం అంటూ, అమరావతి అంబాసిడర్‌గా వైష్ణవిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. లక్షలు ఖర్చు పెట్టి ఆ చిన్నారి చేస్తున్న అభివృద్ధి పనులు అందరికీ స్ఫూర్తినివ్వాలని ముఖ్యమంత్రి అన్నారు... ఎవరి స్థోమతకు తగ్గట్టు రాజధాని నిర్మాణానికి సహాయం చేస్తున్నారు... 10 రూపాయలు విరాళంగా ఇచ్చిన పేదవారు కూడా ఉన్నారు... ఇలాంటి వారిని చూసైనా, అమరావతి మీద పడి ఏడ్చే వారు, బుద్ధి తెచ్చుకుంటారని ఆశిద్దాం....

Advertisements

Advertisements

Latest Articles

Most Read