ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ  వైఖరితో అమరావతి రైతులు పడుతున్న ఇబ్బంది అంతా ఇంత కాదు. అమరావతిలో  రాజధాని ఏర్పాటుకు ఎదురు భుములిచ్చిన రైతులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ఇప్పటి వరకు ఎంత పోరాడినా , కాళ్ళు అరిగేలాగా పాదయాత్రలు చేసినా ప్రభుత్వం మాత్రం తమ మొండి వైఖరిని వదులుకోవడం లేదు. ప్రభుత్వ పని తీరుకు నిరసనగా, దేశ రాజధానిలో తమ గళం విప్పాలని అమరావతి రైతులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15న ఢిల్లీలో నిరసనలు చేపట్టాలని నిర్ణయించినట్టు అమరావతి జేఏసి తెలిపింది. డిసంబర్ 15కి అమరావతి  రైతులు ఉద్యమం మొదలుపెట్టి మూడు సంవత్సరాలు పూర్తి కావడంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర విస్తృత స్థాయిలో నిరసనలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో పోరాడిన రైతులు , ఈ సారి కేంద్రం దగ్గర తమ నిరసన గళం వినిపిస్తామని మీడియా సమావేశంలో తెలిపారు. దీని కోసం ప్రత్యేక రైలులో విజయవాడ నుంచి 1700 మంది వెళ్తున్నామని తెలిపారు. డిసంబర్ 17 న జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి, ఆ తరువాత రోజు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ఎంపీలకు వినతిపత్రాలు అందచేస్తామని తెలిపారు. రైతుల చేస్తున్న ఈ న్యాయపోరాటం లో ఈ సారైనా రాష్ట్రం ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి..

Advertisements

Advertisements

Latest Articles

Most Read