అమరావతి రాజధాని ఇక్కడే కొనసాగుతుందని వైకాపా మేనిఫెస్టోలో పెట్టి, ఎన్నికల ప్రచారంలో చెప్పి అధికారంలోకి వచ్చాక జగన్మోహనరెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మాట తప్పిన విషయం తెలిసిందే. అమరావతి రాజధాని ఉద్యమం 206 రోజులకు చేరుకున్న సందర్భంగా అమరావతి ప్రాంత రైతులు, నిరసన తెలిపారు. వైకాపా మేనిఫెస్టోలో రాజధాని ఇక్కడే అన్నారని, ఎమ్మెల్యే ఆర్కే ఎన్నికల ప్రచారంలో బహిరంగ సభలో ప్రకటించిన విషయం మర్చిపోయారని విమర్శించారు. అమరావతి రాజధాని విషయంలో వైకాపా ప్రభుత్వం, జగన్ మాట తప్పారని, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మాట మార్చారని ఆరోపించారు. రాజధాని ఉద్యమం నేపధ్యంలో రైతులు, మహిళలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాజధానిలో హైకోర్టు, యూనివర్సిటీలు ఏర్పాడ్డాయి. సచివాలయం, అసెంబ్లీ నిర్మించుకొని పాలన కొనసాగుతుందని, జిల్లాల మద్య విభేదాలు సృష్టించడం మంచి పరిణామం కాదని అన్నారు.
వైకాపా ప్రభుత్వం ఎన్ని కుటీల ప్రయత్నాలు చేసిన ఉద్యమం కొనసాగుతోందని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని కోసం రాష్ట్ర భవిష్యత్ కోసం 33వేల ఎకరాల భూములిచ్చిన రైతులను అవమానపరిచే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది, అందరికి ఆమోదయోగ్యమైన అమరావతి రాజధాని వైకాపా ప్రభుత్వం ఎందుకు విస్మరించింది. నాడు నేడు అమరావతి నుండే పరిపాలన కొనసాగుతున్న విషయం గుర్తుచేశారు. రాజధాని సమస్య రాష్ట్ర సమస్య అన్నారు. అయితే ఈ సందర్భంగా వైసీపీ మంత్రుల చేస్తున్న ప్రకటనల పై రాజధాని రైతులు చాలెంజ్ చేసారు. మంత్రులు అందరూ, వైజాగ్ రాజధాని వద్దు అంటూ, అక్కడ ప్రతిపక్ష నేతలను రాజీనామా చేసి గెలవమని అంటున్నారని, మేము కూడా ఛాలెంజ్ చేస్తున్నాం, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామా చేసి, మళ్ళీ గెలవలాని ఛాలెంజ్ చేస్తున్నాం అని, దీని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు రెడీనా అని ఛాలెంజ్ చేసారు.