వెళ్ళిన ఊరే మళ్ళీ మళ్ళీ వెళ్ళటం... రెండేళ్ళ క్రితం మాట్లాడిన వాళ్ళ చేత మళ్ళీ మళ్ళీ మాట్లాడించటం... 5 శాతం మంది కోసం, 95 శాతం రైతుల త్యాగాలను అవహేళన చేస్తూ, వారి గొంతు కొయ్యటం. ఇవన్నీ ఎందుకు అంటే, నిన్నటి పార్లమెంట్ లో గల్లా, రామ్మోహన్ నాయుడు స్పీచ్ డైవర్ట్ చెయ్యటం కోసం, మోడీని కాపాడటం కోసం... 95 శాతం మని ప్రజలు, రాజధాని కోసం భూములు త్యాగం చేసారు. 5 శాతం మందిలో కొంత మంది, కేవలం రాజకీయ కోణంలో, ఆడుతున్న ఆటలో, పవన్ కళ్యాణ్ కూడా చేరారు. నిన్న అమరావతి ఆపాలి అంటూ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లి మొట్టికాయలు తిన్న జనసేన పార్టీ, ఈ రోజు, అక్కడ ప్రజలను రెచ్చగొడుతుంది. ‘మీరు భూములు ఇవ్వకండి.. ప్రభుత్వానికి ఎదురు తిరగండి.. మీకు అండగా నేనుంటా’ అంటూ వాళ్ళని రెచ్చగొడుతున్నారు.

pk 22072018 2

ఈ పోరాటంలో పోలీసులతో కాల్పులు జరపిస్తే మీ ముందు తాను ఉంటానని రైతులకు హామీ ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు కేవలం వారి విధులు నిర్వర్తిస్తున్నారని, వారిని వెనక నుంచి నడిపించేది తెదేపానే అని ఆరోపించారు. భూములను కొద్దిమంది చేతిలో పెట్టడాన్ని జనసేన వ్యతిరేకిస్తుందన్నారు. ఇలా కులాల వారీగా కూడా, పవన్ కళ్యాణ్ ఊరిలో ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ప్రజలను ప్రభుత్వం పై ఎదురుతిరగండి అని చెప్పటం, కాల్పులు జరుగుతాయి అని చెప్పటం, ఇలా అనేక రకాలుగా, అక్కడ ఉన్న ప్రజలని ఎదో జరిగిపోతుంది అని భయభ్రాంతులని చేస్తున్నారు.

pk 22072018 3

దీని పై భూ సమీకరణకు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. రాజధానికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే బలవంతంగా తీసుకుంటున్నారంటూ కొంతమంది రైతులు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. అందుకే భూములివ్వొద్దంటూ, ఎదురుతిరగండంటూ అంటున్నారని పేర్కొన్నారు. బడా భూస్వాములు కొంతమంది తమ భూముల్లో కొంతభాగం విక్రయించుకొని, మిగిలిన కొద్ది భూమిని అడ్డుపెట్టుకొని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, రాజధానికి అడ్డుకొనే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ వారు ఆరోపించారు. అనంతరం ఇలాంటి చర్యలకు నిరసనగా గ్రామంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రాలు అందజేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read