లాక్ డౌన్ కారణంగా, సినిమా షూటింగ్లు అన్నీ నిలిచి పోవటంతో, సినిమా పరిశ్రమలో ఉన్న చిన్న చిన్న వారు, చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యెక జీవో తెచ్చి, షూటింగ్లకు అనుమతులు ఇస్తూ ఒప్పుకోవటం పై, హర్షం వ్యక్తం చేస్తూ, జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి, సినీ పరిశ్రమకు చెందిన కొంత మంది పెద్దలు ఈ రోజు వచ్చి కృతజ్ఞతలు చెప్పారు. చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు, సి. కళ్యాణ్, రాజ మౌళి, ఈ రోజు హైదరాబాద్ నుంచి వచ్చి, జగన్ మోహన్ రెడ్డిని, తాడేపల్లిలోనే ఆయన క్యాంప్ ఆఫీస్ లో కలిసారు. అయితే బయటకు వచ్చిన తరువాత, ఎప్పటి నుంచి జగన్ ని కలవాలని అనుకున్నాం అని, ఇప్పుడు కలిసాం అని, ఏపిలో సినీ పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తాం అని చెప్పారని, అలాగే వైజాగ్ లో స్టూడియో నిర్మాణానికి, అడిగాం అని, దాని పై కూడా సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. అలాగే వైజాగ్ లో స్థిర పడే సినిమా వారికీ, స్థలాలు ఇస్తాం అని చెప్పినట్టు చెప్పారు. అయితే, చిన్న చిన్న సినీ కార్మికులు ఎలా బ్రతకాలి అనేదాని గురించి ఆలోచన చెయ్యకుండా, స్టూడియోల కోసం భూములు, స్థలాల కోసం మాట్లాడటం పై విమర్శలు వచ్చాయి. అయితే ఈ విషయం పక్కన పడితే, అమరావతి ప్రజలతో ప్రవర్తించిన తీరు పై కూడా విమర్శలు వచ్చాయి.

ఈ రోజు గన్నవరం ఎయిర్ పోర్ట్ ల దిగిన చిరంజీవి అండ్ టీం, అక్కడ నుంచి ఉండవల్లి దగ్గర ఉన్న, గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు. చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోలో తమ ప్రాంతానికి వచ్చారని తెలుసుకుని, అమరావతి రైతులు, మహిళలు అక్కడకు చేరుకున్నారు. అయితే వీరి వద్దకు రాకుండానే, కార్లు గెస్ట్ హౌస్ లోపలకు వెళ్ళిపోయాయి. తరువాత అయినా, చిరంజీవి, నాగార్జున, తమ వద్దకు వచ్చి, తమ సమస్యలు గురించి వింటారని, అక్కడ ప్రజలు అనుకున్నారు. అయితే వారు రోడ్డు పక్కన నుంచున్నా, వారిని కనీసం పలకరించకుండా, వారి సమస్య ఏమిటో వినకుండా, అక్కడ నుంచి వెళ్ళిపోయారు. కనీసం తమ సమస్య కూడా వినకుండా, తమను కనీసం పలకరించకుండా, హైదరాబాద్ వెళ్ళిపోవటం పై, విమర్శలు వస్తునాయి. చిరంజీవి కేంద్ర మంత్రిగా, ఒక పార్టీ పెట్టిన వ్యక్తిగా, ఒక స్టార్ హీరోగా, ఇలా ప్రవరిస్తారాని అనుకోలేదని రైతులు వాపోతున్నారు. తమ ఉద్యమానికి మద్దతు తెలపకపోయినా, కనీసం మా మోర ఆలకించండి అని రోడ్డు మీద నుంచున్నా, పట్టించుకోకుండా వెళ్ళిపోవటం ఎంత వరకు సమంజసం అని వాపోతున్నారు. చిరంజీవి ఇలా చేస్తారని అనుకోలేదని, బాధ పడుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read