ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులు ఘన విజయం సాధించారు. రాజధాని అమరావతి పై రైతులు వేసిన పిటీషన్లు అన్నిటినీ కూడా హైకోర్టు విచారణకు స్వీకరిస్తున్నట్టు తీర్పు ఇస్తూ, పలు సంచలన విషయాలు పేర్కొంది. సీఆర్డీఏ రద్దు చేసే శాసనఅధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అంటూ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో పాటుగా రైతులకు ఖర్చులు కూడా ఇవ్వాలని చెప్పి, హైకోర్టు స్పష్టం చేసింది. ఆరు నెలల్లోగా అమరావతిలో జరుగుతున్న పనుల పై స్టేటస్ రిపోర్ట్ తమకు ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. సిఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని కోర్టు స్పష్టం చేసింది. సీఆర్డీఏ చట్టాన్ని అమలు చేయటం, మాస్టర్ ప్లాన్ అమలు చేయటం, ఇలా వివిధ అంశాల పై కోర్టుకు వెళ్ళిన రాజధాని రైతులకు, కోర్టు గుడ్ న్యూస్ వినిపించింది. ఆరు నెలల లోగా మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని కోర్టు తెలిపింది. రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లోగా మొత్తం పనులు అన్నీ పూర్తి చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే భూములు ఇచ్చిన రైతులు మూడు నెలల్లోగా అన్ని సౌకర్యాలతో అభివృధి పారించిన ప్లాట్లను రైతులకు అప్పగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అమరావతిలో చేసిన అభివృద్ధి పనుల పైన ఎప్పటికప్పుడు ఆ నివేదికను కోర్టుకు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చ్సింది.
అలాగే మరో విషయం ఏమిటి అంటే, అమరావతి రాజధానిలో ఉన్న భూములు, ఎక్కడా కూడా తనఖా పెట్టకూడదని, ఎక్కడా కూడా రాజధాని అవసరాలకు తప్ప ఎక్కడా కూడా అమరావతి భూములు వాడుకోకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక్కడ ముఖ్యంగా హైకోర్టు చెప్పిన విషయం, సీఆర్డీఏ చట్టం రద్దు చేసే శాసన అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అంటూ హైకోర్టు చెప్పిన విషయం ఇక్కడ చాల ముఖ్యమైన అంశం. ఇక్కడ ఎవరు అయినా ఈ చట్టం రద్దు చేయటం కుదరదు. ఏ ప్రభుత్వం అయినా సరే, ఆ చట్టం ప్రకారం అక్కడ అభివృద్ధి చేసి చూపించాల్సిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని దొంగ దారుల్లో వెళ్ళినా, ఇక అక్కడ అభివృద్ధి చేయాల్సిందే. ఎక్కడా కూడా వెనకడుగు వేయటానికి వీలు లేదు. ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళినా, సిఆర్డీఏ చట్టం విషయంలో మాత్రం, ప్రభుత్వం ఏమి చేయలేదు అనే విషయం ఇప్పుడు హైకోర్టు తీర్పు చూస్తే అర్ధం అవుతుంది. అమరావతి విషయంలో జగన్ ఏమి చేస్తారో చూడాలి మరి.