రాజధాని అమరావతి నగరంలో ఐఏఎస్‌, ఎమ్మెల్యేలు, ఎన్‌జీవోలకు నిర్మిస్తున్న హౌసింగ్ టవర్స్ నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి.. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబిస్తూ, మలేషియన్‌ షియర్‌ వాల్‌ టెక్నాలజీతో ఒక్క ఇటుక అవసరం లేకుండానే మొత్తం సిమెంట్‌ కాంక్రీట్‌తో ఆకాశహార్మ్యాలను నిర్మిస్తోంది ప్రభుత్వం. ఈ కారణంగా నిర్మాణాల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రాయపూడి, నేలపాడు గ్రామాల్లో పెద్దఎత్తున జరుగుతున్న ఈ నిర్మాణాలు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న కారణంగా, తక్కువ మంది కూలీలతో లక్ష్యసాధన దిశగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి.

housing 27052018 2

సహజంగా ఇంటి నిర్మాణం అనగానే ఇసుక, సిమెంట్‌, ఐరన్‌, కంకరతో పాటు ప్రధానంగా గోడల నిర్మాణానికి ఇటుకలు అవసరమవుతాయి. అయితే ఇది ఖర్చుతో కూడిన వ్యవ హారం. అలానే కొన్ని లక్షల ఇటుకలు నిర్మాణ ప్రదేశానికి తరలించాల్సి ఉంటుంది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొన్న ప్రభుత్వం షియర్‌ వాల్‌ టెక్నాల జీని వినియోగిస్తోంది. లెజిస్లేటివ్‌, ఏఐఎస్‌ అధికారుల కోసం నిర్మిస్తున్న టవర్స్‌కి రూ. 635.91 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఎన్‌జీవోలకు నిర్మిస్తున్న జీవో టైప్‌-1కి రూ.866.1 కోట్లు, క్లాస్‌-4 ఉద్యోగులకు నిర్మించే టవర్స్‌కి రూ. 707.44 కోట్లు కలిపి మొత్తం రూ. 2,209.45 కోట్లతో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇందుకోసం మొత్తం 65.4 ఎకరాల భూమిని వినియోగిస్తున్నారు. మొత్తం 61 టవర్స్‌లో 3,840 ఫ్లాట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.

housing 27052018 3

శాసనసభ్యులు, మండలి సభ్యుల కోసం రాయపూడి గ్రామ పరిధిలోనే మరో బ్లాక్‌లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. ఇక్కడ 12 టవర్స్‌లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. మొత్తం 288 మంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ఇక్కడ నివాస సౌకర్యం కల్పిస్తారు. కృష్ణానదికి సమీపంలో రాయపూడి వద్ద అఖిల భారత సర్వీసు అధికారుల కోసం ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. మొత్తం ఇక్కడ ఆరు బ్లాకుల్లో ఇళ్లను నిర్మిస్తున్నారు. స్టిల్ట్‌ ఫ్లోర్‌ కలిపి మొత్తం 13 అంతస్థులుగా డిజైన్‌ చేశారు. మొత్తం 144 ఫ్లాట్లు నిర్మాణం చేస్తున్నా రు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం నేలపాడు గ్రామంలో బహుళ అంతస్థుల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 27.47 ఎకరాల విస్తీ ర్ణంలో 22 టవర్లను ఇక్కడ నిర్మిస్తున్నారు. 1,968 ఫ్లాట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇవి అన్నీ 2019 ఫిబ్రవరి 12వ తేదీకి పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read