నవ్యాంధ్ర రాజధాని అమరావతిని పవిత్ర సంగమ ప్రదేశానికి అనుసంధానిస్తూ కృష్ణా నదిపై నిర్మించనున్న ఐకానిక్‌ బ్రిడ్జ్‌కు సీఎం చంద్రబాబు ఈ నెల 12న శంకుస్థాపన చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పవిత్ర సంగమం దగ్గర శంకుస్థాపన ఫలకాన్ని ఆ రోజు ఉదయం 10 గంటలకు సీఎం ఆవిష్కరించనున్నారు. అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ఆధ్వర్యంలో నిర్మితమయ్యే ఈ వంతెన అమరావతిలోని ఉద్ధండరాయునిపాలెం నుంచి సంగమ ప్రదేశం వరకూ 3.2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ వంతెన నిర్మాణ వ్యయం సుమారు రూ.1387 కోట్లు. కేబుల్‌పై అరకిలోమీటరు.. రాజధాని శోభను మరింత ఇనుమడింపజేయగల ఈ ఐకానిక్‌ బ్రిడ్జ్‌కు అనేక విశిష్ఠతలున్నాయి.

iconic 09012019

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమై, ఈ ప్రాంతంలోనే పురుడుపోసుకున్న కూచిపూడి నృత్యంలోని అభివాదముద్రను తలపించేలా డిజైన్‌ రూపొందించడం విశేషం. దీంతోపాటు రాష్ట్రంలోనే తొలిసారిగా కేబుల్‌ ఆధారంగా నదిపై నిర్మితమవుతున్న వంతెనగా సైతం ఇది నిలవనుంది. నది మధ్యభాగంలో సుమారు 480 మీటర్ల పొడవునా ఈ వంతెన కేబుల్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రసిద్ధ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సమర్పించిన 6 రకాల ఆకృతులను దీని కోసం సమర్పించింది. నమస్కార ముద్ర, కూచిపూడి నృత్య భంగిమ ముద్ర, కూచిపూడి అరల ముద్ర, పుష్పాన్ని పోలిన ఆకృతిలో ప్రజావారధి(రెండంతస్థులు), అమరావతి స్థూపం, కొండపల్లి బొమ్మ.. ఇలా మొత్తం 6 రకాల ఆకృతులను పరిశీలించిన ముఖ్యమంత్రి, ప్రజాభిప్రాయం తరువాత, కూచిపూడి డిజైన్ ఫైనల్ చేసారు.

iconic 09012019

కృష్ణానదిపై ఇబ్రహీంపట్నం మండలంలోని పవిత్ర సంగమం నుంచి తుళ్లూరు మండలంలోని లింగాయపాలెం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర ఈ వంతెన నిర్మాణానికి అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏడీసీ) త్వరలో త్వరలోనే టెండర్లు పిలవనుంది. ఈ వంతెన కేవలం రాకపోకలకు మాత్రమే ఉపయోగపడేలా కాకుండా వినోద కేంద్రంగా కూడా ఉండేలా చూడాలని భావిస్తున్నారు. అందుకే రెండు అంతస్తుల్లో కింది నుంచి ట్రాఫిక్‌ వెళ్లేలా పైన పర్యాటకులు తిరిగేలా దీన్ని తీర్చిదిద్దను న్నారు. ఈ వంతెనకు సంబంధించి ఇప్పటికే ఎల్‌ అండ్‌ టీ ఆరు కాన్సెప్ట్‌ డిజైన్లను ప్రభుత్వానికి సమర్పించింది. దాదాపు ఆ సంస్థకే వంతెన నిర్మాణ బాధ్యతలను అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read