నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సంబంధించి రెండు కీలకమైన ప్రాజెక్టులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిని రాజధానితో అనుసంధానిస్తూ కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్‌ వంతెనకు చంద్రబాబు ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్రసంగమం వద్ద శంకుస్థాపన చేశారు. తాగునీటి అవసరాలకు చేపడుతున్న నీటిశుద్ధి ప్లాంట్‌కు కూడా భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తెలుగుదనం ఉట్టిపడే విధంగా, అలాగే మన కూచిపూడి పేరు ప్రపంచ వ్యాప్తంగా ధ్వనించే విధంగా, ఈ బ్రిడ్జికి, "కూచిపూడి ఐకానిక్ బ్రిడ్జి"గా నామకరణం చేసారు.

iconic 12012019

ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్రసంగమం నుంచి అమరావతి వరకు కృష్ణానదిపై రూ.1387 కోట్లతో 3.2కి.మీ.ల పొడవైన ఐకానిక్‌ వంతెనను నిర్మించనున్నారు. దీని మధ్యలో 0.48కి.మీ.ల భాగాన్ని ఐకానిక్‌గా నిర్మిస్తారు. ఈ భాగంలో యోగ భంగిమను పోలిన విధంగా పైలాన్‌ ఉంటుంది. దీనిని వంతెనతో అనుసంధానిస్తూ రెండు పక్కలా తీగల అమరిక ఉంటుంది. ఈ పైలాన్‌ ఎత్తు 170 మీటర్లు. ఆరు వరుసలుగా నిర్మిస్తారు. రెండు పక్కలా 2.5 మీటర్ల వెడల్పైన నడకదారి ఉంటుంది. నిర్మాణానికి పైల్‌ ఫౌండేషన్‌ వేస్తారు. ఈ వంతెనతో హైదరాబాద్‌, జగదల్‌పూర్‌ జాతీయ రహదారులు అమరావతితో అనుసంధానమవుతాయి. ఆ రెండు ప్రాంతాల నుంచి 40 కి.మీ.ల దూరంతో పాటు విజయవాడలో ట్రాఫిక్‌ కూడా తగ్గుతుంది. 2 గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. రాత్రి సమయాల్లో అత్యంత ఆకర్షణీయంగా కనిపించేలా విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తారు. ఈ దీపాలు వివిధ కాలాలకు అనుగుణంగా వేర్వేరు రంగులు వెదజల్లుతాయి. నిర్మాణ గడువు రెండేళ్లు. ఎల్‌ అండ్‌ టీ సంస్థ పనులు దక్కించుకుంది. శంకుస్థాపన పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

iconic 12012019

అలాగే, రాజధాని తాగునీటి అవసరాలకు రూ.745.65 కోట్లతో నిర్మించే వ్యవస్థలో భాగంగా మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమం వద్ద 13 మీటర్ల చుట్టు కొలత కలిగిన రెండు ఇన్‌టేక్‌ బావులు నిర్మిస్తారు. కృష్ణాయపాలెం వద్ద 190ఎంఎల్‌డీ సామర్థ్యంగల నీటి శుద్ధి కేంద్రం, 64ఎంఎల్‌ సామర్థ్యం గల... పాక్షికంగా భూగర్భంలో ఉండే... శుద్ధజల రిజర్వాయర్‌, క్లియర్‌ వాటర్‌ పంప్‌ ఏర్పాటవుతాయి. * నీటి పంపిణీ కేంద్రం వద్ద పాక్షికంగా భూగర్భంలో ఉండే 8రిజర్వాయర్లు, ఏడు ఎలివేటెడ్‌ సర్వీస్‌ రిజర్వాయర్లు నిర్మిస్తారు. 1500-2000మి.మీ.ల చుట్టుకొలత కలిగిన 45కి.మీ.ల పొడవైన క్లియర్‌ వాటర్‌ రింగ్‌ మెయిన్‌ (పంపింగ్‌ మెయిన్‌) నిర్మిస్తారు. దీని నుంచి ఈ కేంద్రాలకు 58 కి.మీ.పొడవైన పైప్‌లైన్లు (500 నుంచి 1500 మి.మీ.ల చుట్టుకొలత కలిగిన) వేస్తారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read