రాజధాని అమరావతి పిటీషన్ల పై ఈ రోజు హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ సందర్భంగా రాజధాని పిటీషన్లలో ఇంప్లీడ్ అవుతాం అంటూ, చాలా మంది రాయలసీమ నుంచి, ఉత్తరాంధ్ర నుంచి పిటీషన్లు వేసారు. అమరావతి కేసులో తమ వాదన కూడా వినాలని, రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి కొంత మంది న్యాయవాదులు ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేసారు. అయితే ఈ మొత్తం పిటీషన్ల పై కోర్టు ఈ రోజు తీర్పు ఇచ్చింది. వారి ఇంప్లీడ్ పిటీషన్లను కోర్టు ఈ రోజు తిరస్కరించింది. ఈ పిటీషన్లు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో విచారణ అర్హత కాదు అని ధర్మాసనం భావించింది. అందుకే ఈ ఇంప్లీడ్ పిటీషన్లను ధర్మాసనం కొట్టి వేసింది. ఇదే సందర్భంలో, విశాఖలో గెస్ట్ హౌస్ కి సంబంధించి, ప్రభుత్వం క్యాంప్ ఆఫీస్ కోసం గతంలో ఇచ్చిన అఫిడవిట్ పై ఈ రోజు కూడా విచారణ జరిగింది. విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మిస్తున్నారని చెప్తున్నా, ఇది తొందర్లోనే క్యాంప్ ఆఫీస్ గా మారిపోతుందనే అనుమానాలు రాజాధాని ప్రాంత రైతులు వ్యక్తం చేస్తూ, పిటీషన్ వేసారు. దీని పై కూడా ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా ఈ గెస్ట్ హౌస్ పై, పూర్తి స్థాయి ప్రణాళిక, ప్లాన్ మొత్తం తమ ముందు ఉంచాలని కోర్టు తెలిపింది. ఇక్కడ గెస్ట్ హౌస్ నిర్మాణం అనేది భారీ స్థాయిలో నిర్మిస్తున్నారని, ఇది రాజధాని తరలింపులో భాగం అంటూ, రైతులు కోర్టుకు చెప్పారు.

hc 02112020 2

దీంతో ఆ ప్లాన్ ను కోర్టు ముందు ఉంచాలని, కోర్టు తెలిపింది. ఇదే సమయంలో సియం క్యాంప్ ఆఫీస్ నిర్మాణం అనేది, పరిపాలనా రాజధానిలో భాగంగా నిర్మిస్తున్నారు అనే తెలిస్తే కనుక, అప్పుడు అభ్యంతరాలు పిటీషనర్ తెలియచేస్తూ, కోర్టు దృష్టికి తీసుకుని రావచ్చని కోర్టు తెలిపింది. గతంలో ప్రభుత్వం ఈ విషయం పై వాదిస్తూ, ఇది కేవలం సియం క్యాంప్ ఆఫీస్ అని, దీనికి పరిపాలనా రాజధానికి సంబంధం లేదని, ఎన్ని అయినా సియం క్యాంప్ ఆఫీస్ లు పెట్టుకోవచ్చని, దానికి సంబందించిన వివరాలు కోర్టుకు సమర్పించారు. అయితే దీని పై అన్ని కోణాల్లో పరిశీలించిన కోర్టు, దీని పై వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు అర్ధం అవుతుంది. అందుకే ముందుగా ప్లాన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరటం, అలాగే ఇది పరిపాలనా రాజధానిలో భాగంగా నిర్మిస్తున్నారు అంటే తమ వద్దకు వచ్చి చెప్పవచ్చు అని చెప్పింది. ఇక మరో పక్క ఇంప్లీడ్ పిటీషన్లు అన్నీ కోర్టు కొట్టేసింది. దీంతో ఇప్పుడు ఇక మెయిన్ పిటీషన్ ఒక్కటే మిగిలి ఉంది. దీని పై కూడా రోజు వారీ విచారణ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఇరు వైపులా, ఒక్కొక్కరికీ ఏడు రోజులు సమయం కోర్టు ఇచ్చింది. దీంతో రాజధాని మెయిన్ పిటీషన్ పై కూడా, మరో నెల రోజుల్లోనే ఏదో ఒక విషయం కోర్టు చెప్పే అవకాసం ఉందని తెలుస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read