ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వొకేట్ జనరల్, హైకోర్టు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సహా ఇతరులు పై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇన్సైడర్ త్రాదింగ దే విధంగా, అవినీతి నిరోధిక చట్టం కింద పెట్టిన కేసులు అన్నిటినీ హైకోర్టు కొట్టి వేసింది. కొద్ది సేపటి క్రితం రాష్ట్ర హైకోర్ట్, ఈ మేరకు తీర్పు చెప్పింది. గతంలో హైకోర్టు అడ్వొకేట్ జనరల్ గా పని చేసిన దమ్మాలపాటి శ్రీనివాస్, ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని అవినీతి నిరోధక చట్టం కింద, ఆయన పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. అదే విధంగా మరి కొంత మంది పైన కూడా కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. వీరందరూ కూడా రాజధాని అమరావతి వస్తుందని ముందుగానే తెలుసుకుని, అక్కడ భూములు కొనుగోలు చేసి పెద్ద ఎత్తున సంపాదించారని, దీని పైన ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారు అంటూ కూడా ఏపి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. దీని పైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, స్టే ఇవ్వటంతో, ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. ఇటీవల సుర్పీం కోర్టులో ఈ కేసు విచారణకు రాగా, అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఎక్కడ జరగలేదు అని గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏ తీర్పు అయితే ఇచ్చిందో, ఆ తీర్పుని సుప్రీం కోర్టు సమర్ధించటమే కాకుండా, ఈ కేసుని నెల రోజులు లోపు విచారణ చేయాలని ఏపి హైకోర్టుని ఆదేశించింది.

jagan 02092021 2

దీంతో, దీని పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా విచారణ జరిగింది. అప్పట్లో సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అపీల్ కు వెళ్లిందో, ఆ అప్పీల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే ఈ అంశం పై తేల్చుకుంటాం అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పటంతో, నెల రోజుల లోపు విచారణ జరపాలని ఏపి హైకోర్టుని ఆదేశిస్తూ, సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గత నెల రోజులుగా వాదనలు జరిగాయి, వాదనలు అనంతరం, మొత్తం 14 కేసులు ఇందులో ఉండటంతో, జడ్జిమెంట్ రిజర్వ్ చేసారు. కొద్ది సేపటి క్రితం హైకోర్టు దీని పై తీర్పు ఇచ్చింది. వీరి పైన ప్రభుత్వం చేసిన ఆరోపణలు అన్నీ కూడా నిరాధారం అని, వీటి పై ఎక్కడా రుజువులు ఇవ్వలేక పోయారని స్పష్టం చేసింది. దమ్మాలపాటి శ్రీనివాస్ ని కావాలని టార్గెట్ చేసారు కాబట్టి, అతన్ని మానసికంగా క్షోభ పెట్టినందుకు, ఏమైనా చట్ట చర్యలు తీసుకోవచ్చు అని కూడా కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణల పై మరోసారి న్యాయస్థానాలలో క్లీన్ చిట్ లభించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read