ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసులు విచారణ, ఈ రోజు రెండో రోజు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో త్రిసభ్య ధర్మాసనం ముందు జరుగుతుంది. ఈ త్రిసభ్య ధర్మాసనం ముందు అమరావతి పరిరక్షణ సమితి తరుపున, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్, వాదనలు వినిపిస్తున్నారు. ఆయన నిన్న ఉదయం నుంచి వాదనలు ప్రారంభించారు. నిన్న విచారణ ముగియటం, ఈ రోజు మళ్ళీ ప్రారంభం కావటంతో, ఈ రోజు కూడా వాదనలు కొనసాగించారు. ఈ రోజు వాదనల సందర్భంగా, శ్యాం దివాన్ అమరావతి రైతులు గురించి, వారు రాజధాని కోసం భూములు ఇచ్చిన తీరు, ఇలా ఇవన్నీ కోర్టు ముందు ప్రస్తావించిన సమయంలో, హైకోర్టు చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రానికి రాజధాని అనేది, అది ఒక అమరావతి రైతులదే కాదని, రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలదని, అది కర్నూల్ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, లేకపోతే ఏ ప్రాంతం అయినా, వారి అందరిదీ ఈ రాజధాని అమరావతి అని, కేవలం భూములు ఇచ్చిన 29 వేల మంది రైతులది కాదని చెప్పి, చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా స్పష్టం చేసారు. రాజధాని ఎక్కడ ఉన్నా సరే, ఆ రాజధాని అనేది, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి రాజధాని అనేది గుర్తుంచుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

amaravati 16112021 2

ఈ సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒక ఉదాహరణను కూడా చెప్పారు. స్వతంత్ర సమర యోధులు, స్వతంత్రం కోసం పోరాటం చేసినప్పుడు, దేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే, స్వాతంత్రం అనేది ఆ పోరాట యోదులదే కాదని, భారత దేశం మొత్తానికి ఇది స్వాతంత్రం అనేది గుర్తుంచుకోవాలని స్పష్టం చేసారు. ఇదే సమయంలో మరో కీలక అంశం కూడా హైకోర్టు ముందుకు వచ్చింది. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి, పదే పదే ఆరోపణలు చేసారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం అసలు సిఆర్పీసిలో లేదనే విషయం, శ్యాం దివాన్ స్పష్టం చేసారు. ఇప్పటికే ఈ అంశం పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తో పాటుగా, సుప్రీం కోర్టులో కూడా ఈ అంశం కొట్టి వేసిన విషయాన్ని గుర్తు చేసారు. రాజ్యాంగం ప్రకారం ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా భూములు కొనుకోవచ్చు అని, భూములు ఎక్కడా కొనకూడదనే విషయం ఎక్కడా లేదని, శ్యాం దివాన్, హైకోర్టు ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ఈ రోజు విచారణ ముగియటంతో, తిరిగి రేపు ప్రారంభంకానుంది

Advertisements

Advertisements

Latest Articles

Most Read