ఒక పక్క రాష్ట్రం మొత్తం, కేంద్రం అన్యాయం చేస్తుంది అని పోరాట బాట పడితే, పవన్, జగన్ మాత్రం, కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనకుండా, చంద్రబాబుని మాత్రమే నిందిస్తూ, ఢిల్లీ స్క్రిప్ట్ ప్రకారం ఎలా నడుస్తున్నారో చూస్తున్నాం.... ఇప్పుడు వీరికి తోడు, మేధావులం అని చెప్పుకునే, ఐవైఆర్ కృష్ణారావు, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు కూడా తయారయ్యారు... ఈ రోజు ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ, ఈ నాలుగేళ్లలో కేంద్రం ఏపికి సరిపడా నిధులను ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా జేఎఫ్సీ నివేదిక గురించి ఆయన ప్రస్తావించారు. ఏపీకి కేంద్రం రూ.75 వేల కోట్లు ఇవ్వాలని ఆ నివేదికలో చెప్పలేదని, తప్పంతా కేంద్రానిదే అనేందుకు వీలు లేదని చెప్పారు.
అలాగే, ''ఎవరి రాజధాని అమరావతి'' పుస్తకాన్ని ఈ నెల 5వ తేదీన ఆవిష్కరిస్తానని ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. ఏపీ రాష్ట్రానికి అంతర్జాతీయ రాజధాని అనేది అవసరం లేదని తేల్చి చెప్పారు... ఈ పుస్తకాన్ని ఈనెల 5న పవన్‌కల్యాణ్ ఆవిష్కరిస్తారని, పుస్తకావిష్కరణకు మాణిక్యాలరావు, ఉండవల్లిని ఆహ్వానిస్తున్నాని చెప్పారు. ఈ పుస్తకాన్ని వడ్డే శోభనాద్రీశ్వరరావు గారికి అంకితం చేస్తున్నాను. ఇందుకు ఆయన కూడా అంగీకారం తెలిపారు. ఏప్రిల్ 5న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య భవన్‌లో జరిగే కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అని ఈయన సెలవిచ్చారు...
మహారాజధాని నిర్ణయమే ఓ తప్పుడు కాన్స్పె ప్ట్ అంటూ, ఈయన ఎజెండా ఏంటో చాలా క్లియర్ గా అర్ధమవుతుంది.. మీకు ఇంతటి రాజధాని ఎందుకురా అని ఢిల్లీ పెద్దలు ఎలా అవహేళన చేస్తున్నారో, వీళ్ళు దానికి వంత పాడుతున్నారు... మొన్న పవన్ కళ్యాణ్ అమరావతి పై చెప్పిన మాటలు, ఈ రోజు ఐవైఆర్ పుస్తకం, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్... అసలు ట్విస్ట్ ఏంటి అంటే, ఈ పుస్తకం పవన్ కళ్యాణ్ రిలీజ్ చెయ్యటం... కేంద్రం పై ఒత్తిడి తేవాల్సింది పోయి, మీకు రాజధాని వద్దు, మీకు కేంద్రం ఎన్నో నిధులు ఇచ్చింది అంటూ, ఈ హైదరాబద్ బ్యాచ్ వచ్చి, మనకు నీతులు చెప్తున్నారు... ఏమి చేస్తాం, ప్రజా స్వామ్యం కదా..