అమరావతి జేఏసి ముగింపు సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సందర్భంగా, ఈ నెల 17న బహిరంగ సభ నిర్వహించాలని అమరావతి జేఏసి నిర్ణయం తీసుకుంది. ఈ సభ కోసం తిరుపతి ఎస్పీకి దరఖాస్తు చేయగా, పోలీస్ వారు తిరస్కరించారు. దీంతో, అమరావతి జేఏసి ఈ విషయం పై కోర్టుకు వెళ్ళింది. ఈ రోజు హైకోర్టులో ఈ పిటీషన్ పై విచారణ జరిగింది. మూడు రాజధానులు సభకు అనుకూలంగా తాము కూడా సభ నిర్వహిస్తామని రాయలసీమ ఫోరం కూడా హైకోర్టులో పిటీషన్ వేసింది. దీని పైన అమరావతి పరిరక్షణ సమితి నుంచి పోసాని వెంకటేశ్వరులు అదే విధంగా, లక్ష్మీనారాయాణ వాదనలు వినిపించగా, ప్రభుత్వం వైపు నుంచి అడిషనల్ అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. కో-వి-డ్ ప్రోటోకాల్ ప్రకారం, సభ నిర్వహించుకుంటామని, అనుమతి ఇవ్వాలని, అమరావతి పరిరక్షణ సమితి న్యాయవాదులు వాదించారు. ఈ సభ నిర్వహిస్తే రెండు వర్గాల మధ్య విబేధాలు నెలకొంటాయి, అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందని, ప్రభుత్వం తరుపు న్యాయవాది వాదించారు. ఈ నేపధ్యంలోనే హైకోర్టు కొద్ది సేపటి క్రితం తీర్పుని ఇచ్చింది. ఇందులో భాగంగానే మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది.

hcamaravati 15122021 2

అదే విధంగా, కోవిడ్ ప్రోటోకాల్ ని అనుసరించి, సభ పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అదే రోజు రాయలసీమా సాధన సమితికి చెందిన న్యాయవాదులు కూడా తమకు బహిరంగ సభ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా, హైకోర్టు అందుకు తిరస్కరించింది. ఆ మరుసటి రోజు మీరు అనుమతి తీసుకోవచ్చని, ఆ రోజు సభ నిర్వహించుకోవచ్చని హైకోర్టు సూచించింది. దీంతో అమరావతి రైతుల మహా పాదయాత్ర న్యాయస్థానం టు దేవస్థానం కు హైకోర్టు నుంచి అనుమతి లభించిందో, అదే విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ హైకోర్టు జోక్యంతోనే, పాదయాత్ర ముగింపు సభకు అనుమతి ఇచ్చింది. ఈ రోజు , రేపు అమరావతి రైతులు తిరుమల శ్రీవారని దర్శించుకుని, కిందకు వచ్చి, ఎల్లుండి, పాదయాత్ర సభ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇందు కోసం అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజా సంఘల నేతలు, ఈ బహిరంగ సభకు రానున్నారు. హైకోర్టు ఆదేశాల పై పూర్తి వివరాలు రానున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read