నవ్యాంధ్ర రాజధాని అమరావతికి పొంచివున్న ముప్పును సాంకేతిక పరిజ్ఞానంతో తప్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఒక కొలిక్కి వస్తున్నాయి... రాజధాని అమరావతిలో సుమారు పదివేల ఎకరాలను ముంపునకు గురిచేసే కొండవీటివాగు వరద సమస్యకు చెక్‌ పెడుతూ దానినే సుందర వాహినిగా తీర్చిదిద్దేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ తీసుకుంటున్న చర్యలు వేగం పుంజుకున్నాయి. సింగపూర్‌లో ఓ నది నుంచి తరచూ వస్తున్న వరద కట్టడికి అక్కడి ప్రభుత్వం రూపొందించిన విధానాన్ని అధ్యయనం చేసి రూపొందించిన మాస్టర్‌ప్లాను మేరకు కొండవీటివాగు వరద కట్టడి ప్రాజెక్టును చేపడుతున్నారు...

kondaveeti vagu 12022018 2

తొలిదశ కింద ఉండవల్లి కృష్ణాతీరం వద్ద రూ.237 కోట్ల వ్యయంతో వాగు వరద నీటిని కృష్ణానదిలో ఎత్తి పోసేవిధంగా 16 మోటార్లతో భారీ ఎత్తిపోతల పనులను చేపట్టిన సంగతి తెలిసిందే... మేము మీకు 1500 కోట్ల ఇచ్చాం ఏమి చేసారు అనే వారికి, అమరావతిలో ఒక్క ఇటుక లేదు అనే వారికి ఇలాంటివి కనిపించవు... మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకుని నిర్మాణ పనులను జరిపిస్తోంది. ప్రస్తుతానికి 75 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. కాంట్రాక్టు ఏజెన్సీ సంస్థ మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ పట్టిసీమ ఎత్తిపోతలను ఎంతైతే వేగంగా పూర్తిచేసిందో అదే వేగాన్ని కొండవీటివాగు ఎత్తిపోతల నిర్మాణ పనుల్లోనూ చూపిస్తోంది...

kondaveeti vagu 12022018 3

ఉండవల్లి కరకట్టకు ఎగువన డెలివరీ సిస్టమ్‌కు దక్షిణ అభిముఖంగా అత్యంత ప్రధానమైన పంప్‌హౌస్‌ను రూ.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇందులో మొత్తం 16 పంపులను ఏర్పాటుచేస్తున్నారు. ప్రస్తుతానికి 12 పంపులను బిగించేందుకు అనువుగా పంప్‌హౌస్‌ నిర్మాణం పూర్తయింది. మరో నాలుగు పంపులను ఏర్పాటుచేసేందుకు వీలుగా నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పంప్‌హౌస్‌పైన మోటార్లను ఏర్పాటుచేసేందుకు మోటారుహౌస్‌ను ఏర్పాటు చేయాల్సివుంది. పంప్‌హౌస్‌పైన నిర్మించిన కాంక్రీటు శ్లాబ్‌పై సంబంధిత మోటార్లను బిగించి వాటి రక్షణ కోసం ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ నిర్మాణాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పంప్‌ కమ్‌ మోటారు హౌస్‌లో ఏర్పాటు చేయబోయే అన్ని రకాల యంత్రసామాగ్రిని రూ.91 కోట్లతో కోనుగోలు చేసి క్షేత్రస్థాయిలో సిద్ధంగా వుంచారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read