రాజధాని అమరావతి భూములు పై సంచలన విషయం బయటకు తెచ్చారు బీజేపీ నేత లంకా దినకర్. ఆయన మాట్లాడుతూ, అమరావతి భూములు అమ్మకానికి పెట్టి, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, అప్పు తెచ్చినట్టు చెప్పారు. ఆయన మాటల్లోనే "AP CRDA  రద్దును వెనక్కి తీసుకున్నాక  AMRDA 2021 డిసెంబర్ 9 నాటికి రద్దయినట్టు కదా? - మరి అమరావతి భూముల అమ్మకం ద్వారా అప్పు తీరుస్తామని 2021 డిసెంబర్ 9న సంతకాలతో AMRDA ద్వారా రూ.2,994.46 కోట్ల అప్పు ఎలా చేస్తారు? - అప్పుకోసం రాష్ట్ర ప్రభుత్వం మార్జిన్ మనీ రూ.765.58 కోట్ల కోసం ఇప్పటివరకు అమరావతిలో పూర్తిచేసిన కొన్ని కట్టడాలు చూపారు - మరి అమరావతిలో ఏమీలేదు శ్మశానం అన్నారు కదా? - ప్రభుత్వ మార్జిన్ మనీ రూ.765.58 కోట్లు APCRDA పరిధి కింద సృష్టించబడనప్పుడు ప్రస్తుతం లేని AMRDA కింద ఎలా చూపుతున్నారు? - APCRDA రద్దును వెనక్కి తీసుంది.. అమరావతి భూములు భవిష్యత్‍లో అమ్మి ఇప్పుడు చేసే అప్పులు తీర్చడానికేనా? - దీనికి సీఎం జగన్ సమాధానం చెప్పాలి" అన్నారు బీజేపీ నేత లంకా దినకర్. మరి ఈ విషయం పై ప్రభుత్వ వర్గాలు ఏమి చెప్తాయో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read