ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒక్కటే అంటూ, మరోసారి కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభ సాక్షిగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒక్కటే అని, అమరావతి మాత్రమే అని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని గుర్తించి, దానికి ఇప్పటికే రూ.2500 కోట్లు ఇచ్చినట్టు కేంద్రం రాజ్యసభలో తెలిపింది. అమరావతి మాత్రమే రాజధాని అని కేంద్రం చెప్పటం ఇది మొదటి సారి మాత్రమే కాడు. ఈ రోజు రాజ్యసభలో కానీ, గతంలో హోంశాఖ సమావేశంలో కూడా ఏపి మూడు రాజధానులు అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. కేవలం ఒక్క రాజధాని మాత్రమే అని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అములు, దీనికి కేంద్రం అందిస్తున్న సాయం పై, రాజ్యసభలో ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ప్రశ్నించారు. దీనికి కేంద్రం సమాధానం చెప్తూ, విభజన హామీ చట్టంలోని నిబంధనలు, నీతి ఆయోగ్ సిపార్సుల మేరకు ఏపీకి సాయం అందిస్తున్నామని చెప్పింది.
రీసోర్స్ ఫండింగ్ గ్యాప్ కింద రూ.5,617.89 కోట్లు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల కింద రూ.1750 కోట్లు, నూత రాజధాని నిర్మాణం కోసం రూ.2500 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.13,226 కోట్లు, విదేశీ సాయం కింద చేపట్టిన ప్రాజెక్టులకు తీసుకున్న రుణాలు, వడ్డీల కింద రూ.15.81 కోట్లు, ఇలా ఇప్పటి వరకు మొత్తం 23,110.472 కోట్లు సాయం అందించామన్న కేంద్రం చెప్పింది. రాజ్యసభలో కేంద్రమంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అయితే ఇచ్చినవి చెప్పారు కానీ, ఇంకా ఇవ్వనవి చాలానే ఉన్నాయి. పదేళ్ళ కాల పరిమితితో విభజన చట్టం ఉండగా, ఇప్పటికే 9 ఏళ్ళు అయిపోయాయి. మరో ఏడాది మాత్రమే మిగిలి ఉంది. రాబోయే బడ్జెట్ చివరి బడ్జెట్. మరి కేంద్రం ఎంత మేరకు ఆ విషయాలు అని నెరవేరుస్తుందో చూడాలి. మెడలు వంచి తెస్తాం అని వైసీపీ ఎంపీలు మౌనంగా ఉండి పోయారు. ఇక రాష్ట్రంలో ప్రజలు కూడా విభజన హామీల పైన పెద్దగా పట్టించుకోవటం లేదు. ఈ రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలి మరి..