33 వేలు ఎకరాలు మన కలల రాజధాని కోసం త్యాగం చేసారు వారు... వారికి అన్ని విధాలుగా అండగా ఉండాల్సింది పోయి, వారి సమస్యలు ప్రభుత్వంతో పోరాడాల్సింది పోయి, మన రాష్ట్రంలో అసుర జాతి, వారికి అడుగడుగునా అడ్డం పడ్డారు... వారికి భవిష్యత్తు మీద నమ్మకం లేకుండా చేస్తున్నారు... వారికి మానిసిక ప్రశాంతత లేకుండా, రాక్షస పత్రికలు, టీవీల్లో సైకో కధనాలు వేస్తూ, సాడిస్ట్ లు లాగా ఆనందం పొందారు... ఇంత చేసినా వారు కేవలం ఒకే ఒక్క వ్యక్తిని నమ్మారు... ఆయనే మన ముఖ్యమంత్రి.... ఒక్క ఆందోళన లేకుండా 33 వేలు ఎకరాలు ఆయన చేతిలో పెట్టారు... ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగలేదు... అది ఒక నాయకుడు మీద, ప్రజలకు ఉన్న నమ్మకం...
అందుకే ఈ అసుర జాతి రూట్ మార్చింది... రైతులని రెచ్చగొట్టి ఏమి చెయ్యలేమని, చంద్రబాబుని ఇబ్బంది పెట్టలేమని అలోచించి, అసత్య ప్రచారాలు చేసింది... కోర్ట్ లో కేసులు వేసి లేట్ చేస్తుంది... సహాయం చేసే వారికి దొంగ ఈమెయిల్స్ పంపింది... వారి దొంగ చానల్స్, దొంగ పేపర్ లో, అమరావతి పరువు తీసుతూ, లూస్ సాయిల్ అని, బూకంపాలు అని, కొండవీటి వాగుతో వరదలు అని, ఇలా అన్ని రకాలుగా దొంగ ప్రచారాలు చేసింది... చివరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేసింది...
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో సత విధాలుగా అమరావతిని ఆపటానికి ప్రయత్నాలు చేసింది... వీరి మాట వినకుండా, ప్రభుత్వానికి 33 వేలు ఎకరాలు ఇచ్చిన రైతుల జీవితాలు నాశనం చెయ్యాలని ప్లాన్ వేసింది... అయితే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వీరి మాటలు వినలేదు... అమరావతి అన్నదాతల త్యాగం ఫలం గెలిచింది... రాక్షసులు ఓడిపోయారని తెలుసుకున్న రాజధాని రైతులు సంబరాలు చేసుకున్నారు.. స్వీట్లు పంచుకుంటూ, టపాకాయలు కాలుస్తూ ఈ అసురల ఆటలు సాగావ్ అంటూ, పండగ చేసుకున్నారు...