ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర వైసీపీ నేతలకు వారుచేసిన తప్పుడు పనులకు ఎప్పుడైతే ప్రజల నుంచి సెగ తగులుతుందో, ఎప్పుడైతే వారి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలుతుందని, అనిపిస్తుందో అప్పుడు ప్రతిపక్షంపై కొత్తకొత్త ఆరోపణలు చేస్తుంటారని, చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ సహా, ఇతర టీడీపీ నేతలపై నోటికొచ్చినట్లు అడ్డగోలుగా మాట్లాడుతుంటారని, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... "తాజాగా రాజధాని అసైన్డ్ భూములకు సంబంధించి, చంద్రబాబు నాయుడు,ఇతర టీడీపీ నేతలపై పాలక పక్షంలోని వారు చేసిన అసంబద్ధ, నిరాధార ఆరోపణలు ఆ కోవలోకే వస్తాయి. ముఖ్యమంత్రికి, తాడేపల్లి ప్యాలెస్ కు ఎంత సెగ తగులుతుందో గత కొద్ది రోజుల నుంచీ గమనిస్తూనే ఉన్నాం. పాలకులు చేస్తున్న అవినీతి, దోపిడీకి సంబంధించిన ఆధారాలు కూడా ఎప్పటికప్పుడు బయట పడుతున్నాయి. గతంలో వీరుచేసిన అనేక అరాచకాలకు సంబంధించిన విచారణలు కూడా వేగవంతమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒకటి చేసి, ప్రజల దృష్టి మరల్చాలనే తాడేపల్లి ప్యాలెస్ లోని స్క్రిప్ట్ రైటర్లు తప్పుడు స్క్రిప్టులు వదులుతుంటారు. వై.వీ.సుబ్బారెడ్డి కుమారుడైన విక్రాంత్ రెడ్డి అనుంగు అనుచరుడైన లవకుమార్ రెడ్డి టెలిఫోన్ సంభాషణ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఉత్తరాంధ్రలో 15వేల కోట్ల బాక్సైట్ దోపిడీ కోసం ఏకంగా అటవీ ప్రాంతంలో పెద్దరోడ్డే వేసేస్తున్నారు. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రే తన ఇసుక దోపిడీ కోసం స్వయంగా రూ.150 కోట్లతో కరకట్ట విస్తరణ పేరుతో రాజమార్గానికి శంఖుస్థాపన చేశాడు. ముఖ్యమంత్రి చేసిన తప్పుడుపనులన్నింటికి సంబంధించి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వ్యాఖ్యలు, చేతలపై కేంద్రహోంశాఖ దర్యాప్తునకు ఆదేశించడం జరిగింది. ఇలాంటి అనేక సెగలతో ముఖ్యమంత్రికి ఊపిరాడటంలేదు. దాంతో ఏం చేయాలో పాలుపోక దిక్కు తోచని స్థితిలో పడిన తాడేపల్లి మాయల ఫకీర్ రాత్రిపూట ఆత్మలతో మాట్లాడుకుంటూ, పగటిపూట టీడీపీపై తప్పుడు స్క్రిప్ట్ లు వదులుతున్నాడు. ఆ స్క్రిప్ట్ ఏంటయ్యా అంటే పాత ఆవుకథే. రాజధానిలో ఏదో జరిగిపోయింది.. అమరావతిలో చంద్రబాబు నాయుడు తన బినామీల పేరుతో పెద్దఎత్తున దోచుకున్నాడు.. దళితులకు చెందిన అసైన్డ్ భూములను కాజేశాడని కట్టు కథలు అల్లడం ప్రారంభించారు.

అలాంటి కట్టు కథలకు పెట్టిందిపేరు కరకట్ట కమల్ హాసన్. మీడియా ముందు అద్భుతంగా నటిస్తుంటాడు. వారికి సపోర్ట్ చేయడానికి కొన్ని మీడియా ఛానల్స్. ఆళ్ల రామకృష్ణారెడ్డికి, వైసీపీనేతలైన కొందరు చచ్చుసన్నా సులకు ఒకటే చెబుతున్నాం. అధికారంలోకి వచ్చి రెండేళ్లైం ది.. తప్పుడు ఆరోపణలు చేయడం తప్ప, ఆధారాలకు సంబంధించి చిన్నకాగితం ముక్కైనా బయటపెట్టారా? అసైన్డ్ భూములు ఇతరులపేర్లతో రిజిస్ట్రేషన్ జరిగాయి... దళితులకు తీరని అన్యాయం జరిగింది.. చంద్రబాబునాయుడు అంత దోచాడు..ఇంతదోచాడు అనే సన్నాసులు ఒక్కఆధారమైనా బయటపెట్టారా?అసైన్డ్ భూములు ఇతరులపేర్లపై ట్రాన్స్ ఫర్ అవుతాయా? అలా ఏరోజు ట్రాన్స్ ఫర్ కావు. అది అందరికీ తెలిసిందే. ఇక ప్యాకేజీ గురించి మాట్లాడితే, రాజధానికి రైతులిచ్చిన 33వేల ఎకరాల్లో 3వవంతు భూమి,స్వచ్ఛందంగా దళితులు ఇచ్చిందే. ఆ భూమికి సంబంధించి దాదాపు 63,410 ప్లాట్లు (రెసిడెన్షియల్,కమర్షియల్ కలిపి) టీడీపీ ప్రభుత్వంలో భూ యజమానులకు ఇవ్వడం కూడా జరిగింది. 63,410 రిటర్న్ బుల్ ప్లాట్స్ కాకుండా, వేరే ఏరకమైన పరిహారమైనా, ఎక్కడైనా దళితులకు ఇచ్చిందిలేదు. ప్రభుత్వంపై ఎలాంటి భారం పడకుండా గతప్రభుత్వం, రాజధానికి 33వేలఎకరాలు సేకరించిది. 63,410 ప్లాట్లలో భూమిచ్చినవారు కాకుండా,ఇతరుల పేరుతో ఎక్కడైనా ఒక ప్లాట్ ఇచ్చినట్లు ఈవైసీపీ సన్నాసులు రుజువుచేయగలరా? రెండేళ్లనుంచి ఇదే అడుగుతున్నా ...చెప్పిన కట్టుకథలే మళ్లీ,మళ్లీ చెబుతున్నారు. చవట సన్నాసుల్లా పిచ్చికబుర్లు చెప్పడం మానేయండి. సీఆర్డీఏ రికార్డులు మీప్రభుత్వం దగ్గరే ఉన్నాయికదా.. దానికి సిట్ లు,సీఐడీలు, రఘురామరెడ్డి అనే ప్రత్యేకఅధికారి, మంత్రుల కమిటీలు ఇన్నికావాలా? ఇన్నివ్యవస్థలు మీచేతుల్లో ఎం దుకు ఉంచుకున్నారు? ఎవరిపేరుతో ఎన్నిప్లాట్లున్నాయి.. ఎవరు భూమిలిచ్చారనేది తెలుసుకోవడానికి ఎంత సమయం కావాలి. భూములిచ్చిన వారు కాకుండా,ఇతరులపేర్లతో ఎక్కడా ఎవరికీ ఒక్క ప్లాట్ కూడా ఇవ్వలేదు. ఈ వాస్తవం తెలిసికూడా కావాలనే బురద జల్లడం కోసం తప్పుడు వ్యా ఖ్యానాలు చేస్తున్నారు. అసైన్డ్ భూములను ట్రాన్స్ ఫర్ చేయడమే కుదరుదు. చంద్రబాబునాయుడి ప్రభుత్వం 01-01-2015 లో విడుదల చేసిన జీవోనెం-1లో పట్టాభూముల యజమానులతో పాటు, అసైన్డ్ భూముల యజమానులకు కూడా సమానంగా ప్యాకేజీ ఇస్తామని చెప్పారు.

జరీబు భూములకు రెసిడెన్షియల్ ప్లాట్ 800గజాలు, కమర్షియల్ ప్లాట్ 200 గజాలుఇస్తామని జీవోనెం-1లో చెప్పారు. అసైన్డ్ భూములకు సంబంధించి దళితులకు న్యాయంచేసిన ఘనత చంద్రబాబునాయుడిదే. అంతటితో ఆగకుండా, ఇంకామెరుగ్గా అసైన్డ్ భూ యజమానులకు న్యాయంచేయడం కోసం జీవోనెం-1కి కొనసాగింపుగా, జీవోనెం-41 తీసుకొస్తే, దాన్నికూడా వైసీపీసన్నాసులు తప్పుపడుతున్నారు. దానిలోతప్పేముందయ్యా.. దళితుల కు మెరుగైన పరిహారమిస్తే, ఎందుకంతలా ఏడ్చిచస్తున్నా రు? దళితులు ఆర్థికంగా బలపడటాన్ని జీర్ణించుకోలేకపోతు న్నారా? జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి దళితుల అసైన్డ్ భూములుకాజేసి, నిలదీశాక, అయ్యయ్యో తప్పయిం దని అసెంబ్లీలో ఒప్పుకున్నది నిజంకాదా? అసైన్డ్ భూము లను కబ్జాచేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది, ఆయన కుటుం బానిదే. కొందరుఅధికారులు ఉన్నట్టుండి నిజాలుచెబుతు న్నారంట..ఇంకా ఏదో రుజువుచేస్తామని ఆళ్లరామకృష్ణారెడ్డి చెబుతున్నాడు. అనాడు చంద్రబాబునాయుడి హాయాంలో పనిచేసిన అధికారులే ఇప్పుడు మీప్రభుత్వంలో ఉన్నారు. నిజంగా ఏదైనా తప్పుజరిగితే సదరు అధికారులు నోట్ ఫైల్ పై రాస్తారుకదా? అలాంటివన్నీ మీ దగ్గరేఉన్నాయి.. ప్రభు త్వమే మీది. అయినా ఏంసాధించారు? ఆళ్ల మీడియాతో మాట్లాడుతూ, పిచ్చిపిచ్చిగా పాగల్ గాడిలా మాట్లాడాడు. కాసేపు రికార్డులు లేవంటాడు.. కాసేపు రికార్డులన్నీతమ దగ్గరే ఉన్నాయంటాడు. ఏంది ఆయన లొల్లి. రికార్డులు బయటకు తీస్తే ఎవరుబినామీలో తేలుతుందికదా? అవిబయ టపెట్టినా ఏంకాదు. ఎందుకంటే ఒక్కప్లాట్ కూడా బినామీల పేరుమీదఇచ్చినట్టుఎక్కడా లేదు. అలాఇచ్చినట్టు ఈప్ర భుత్వం ఇంతవరకు రుజువుచేయలేకపోయింది. చేయలేదు కూడా. చంద్రబాబునాయుడు ప్లాట్ లుఇవ్వడమే కాకుండా, వాటిని అమ్ముకొని, తమ బిడ్డల భవిష్యత్ బాగుచేసుకునే వెసులుబాటు కల్పించారు. మీరు, మీప్రభుత్వంజీవోనెం – 41 ని తప్పుపడుతున్నారు.. మరి మీ ప్రభుత్వం 21-01-2020న ఇచ్చిన జీవోనెం-72 పరిస్థితేమిటి? ఇప్పటికైనా చంద్రబాబునా యుడిపై బురదజల్లడం మానుకో. ఆయన వెంట్రుకకూడా టచ్ చేయలేరు. నువ్వు, కేసీఆర్ ఆడుతున్న నీళ్ల డ్రామా లను కూడా ప్రజలు గమనిస్తున్నారు. సిట్ లు, మంత్రుల ఉపసంఘాలు, సీఐడీలు చంద్రబాబునాయుడి వెంట్రుక కూడా టచ్ చేయలేవని తెలుసుకో మాయలఫకీర్. బాధ్యత గలముఖ్యమంత్రిగా ప్రజలసమస్యలు పరిష్కరించడానికి పనిచేయ్.. అంతేగానీఇలాంటి ఆరోపణలతో పబ్బం గడుపు కోవాలనిచూడకు. వైసీపీనేతలుకూడా ఇవన్నీ గుర్తుపెట్టుకొ ని మసులుకుంటే మంచిది. చంద్రబాబునాయుడు ఏం చేసినా ఎక్కడా ఎలాంటిపొరపాట్లకు తావులేకుండా రాజధా ని నిర్మాణం చేపట్టారు. ఈ ముఖ్యమంత్రి భూము లిచ్చిన వారితోపాటు, ఇవ్వనివారి వీపులుకూడా పగులగొడుతున్నాడు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read