మొన్నటి దాక అమరావతి అంటే, ప్రపంచంలోనే అతి పెద్ద నిర్మాణం జరుగుతున్నా ప్రదేశం. దాదపుగా 40 వేల మంది కార్మికులు ఒకే చోట పని చేస్తున్న ప్రదేశం అది. కాని ప్రభుత్వం మారటంతో, మొత్తం తారుమారు అయ్యింది. 40 వేల మంది కార్మికులు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అక్కడ సైట్ ల ముందు కాపలా ఉన్న వాచ్ మెన్ ల మినహా, అక్కడ ఎవరూ ఉండటం లేదు కూడా. అయితే ఇప్పుడు ఇదే కొంత మందికి మహా భాగ్యం అయ్యింది. మొన్నటి దాక అక్కడ అనేక యంత్రాలు, స్టీల్, తో పాటు, మిగతా ఇతర సామగ్రి ఉండేది. పనులు మధ్యలో ఆపటంతో, కాస్ట్లీ యంత్రాలు ఇప్పటికే అక్కడ నుంచి తరలించారు. ఇంకా అక్కడ చాలా నిర్మాణ సామగ్రి మిగలె ఉంది. దీని పై కన్నేశారు స్థానిక నాయకులు. రాత్రి సమయాల్లో ఆ మిగిలిన నిర్మాణ సామగ్రిని అక్కడ నుంచి దొంగాలిస్తున్నారు. అక్కడ ఉన్న, స్టీల్, ఇసుక, మట్టి, పైపులు, ఇలా ఉన్న నిర్మాణ సామగ్రిని రాత్రికి రాత్రి స్కెచ్ వేసి లేపెస్తున్నారు.

ప్రభుత్వం ఇసుక రవాణా ఆపెయ్యటంతో, ఇక్కడ ఉన్న ఇసుకను ఎత్తుకొపోయి, బ్లాకు లో అమ్ముకుంటున్నారు. అక్కడ చాలా చోట్ల కాపలా ఎవరూ లేకపోవటంతో, ఇంకా బరి తెగిస్తున్నారు. కాపలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, వారిని బెదిరిస్తున్నారు. మేము స్థానిక నాయకులం, మా వెనుక పెద్ద తలకాయలు ఉన్నారు జాగ్రత్త అంటూ, బెదిరించి తీసుకుపోతున్నారు. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకు చెందిన కాస్ట్లీ మెటీరియల్ అక్కడ నుంచి పోవటంతో, వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయినా ఈ చోరికి అడ్డుకట్ట లేకుండా పోయింది. మరో పక్క, ఈ తతంగం అంతా చూస్తున్న స్థానిక రైతులు మాత్రం, రాత్రి పూట జరుగుతున్న ఈ దోపిడీ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటిదాక ప్రపంచ స్థాయి రాజధాని అవుతుందని కలలు కన్న అమరావతిని, ఈ రోజు దొంగల పాలు అవుతుంటే, చూస్తూ ఉండిపోవటం తప్ప, ఏమి చెయ్యలేం అని బాధపడుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read