అమరావతి నిర్మాణంలో మరొక కిలక ఘట్టం ఆవిష్కృతమైంది. సచివాలయం ఐదు టవర్ల నిర్మాణంలో భాగంగా ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఉదయం ప్రారంభించారు. శాంతి హోమం నిర్వహించిన తర్వాత సరిగ్గా ముహూర్త సమయం 8-50 గంటలకు ర్యాప్ట్ ఫౌండేషన్ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి, దేవినేని ఉమ, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే శ్రవణ్, స్థానిక నేతలు తదితరులు హాజరయ్యారు. దేశంలోనే తొలిసారి అమరావతిలో ర్యాప్ట్ ఫౌండేషన్ పనులను చంద్రబాబు ప్రారంభించారు.
11వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌తో సచివాలయ టవర్లకు ర్యాప్ట్ ఫౌండేషన్ వేస్తున్నారు. 13 అడుగుల లోతులో 4 మీటర్ల ఎత్తున ర్యాప్ట్ ఫౌండేషన్ నిర్మాణం జరుగుతోంది. 72 గంటలపాటు ఏకధాటిగా ఈ పనులు జరగనున్నాయి. ఐదు టవర్లలో సచివాలయం, హెచ్‌వోడీల భవనాలు, డయాగ్రిడ్ నమూనాలో ఫ్రేమ్ ఆధారంగా టవర్ల నిర్మాణం జరగనుంది. 41 ఎకరాల్లో 69 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సచివాలయ నిర్మాణం జరుగుతుంది. 50 అంతస్థులతో ఐకానిక్‌గా జీఏడీ టవర్ నిర్మాణం జరుగుతుంది. 225 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అతి ఎత్తయిన సచివాలయ భవనం నిర్మించనున్నారు. భూకంపాలు, పెనుగాలుల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా డిజైన్ రూపొందించారు.
ఇది ఇలా ఉండగా, ఈ పనులు 72 గంటల పాటు నిర్విరామంగా కొనసాగనున్నాయి. ఈ రోజు రాత్రి పూట కూడా పనులు వేగంగా సాగుతున్నాయి. అమరావతిలో ఒక్క ఇటుక కుడా పేర్చకుండా గ్రాఫిక్స్ లో చూపిస్తున్నారని అడ్డమైనా వాగుడు వాగుతున్న వాళ్ళంతా అటువైపు పోయి ఒకసారి చూసిరండి. అక్కడ ఒక అద్భుతమైన మహనగరం రూపుదిద్దుకుంటుంది! 10గుజరాత్ లు కలిపిన ఈ మహనగరాన్ని తలదన్నలేవ్! అంతలా పనులు జరుగుతున్నాయి. ఇది ఒక్కటే కాదు, ఇంకా అనేక బిల్డింగ్ ల పని జరుగుతుంది. ఒక పక్క హైకోర్ట్ పనులు చివరిలో ఉండగా, ఐఏఎస్, ఐపీఎస్, ఉద్యోగస్తులు హౌసింగ్, పేదల హౌసింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో పక్క రోడ్లు, డ్రైనేజీ లాంటి మౌలిక వసతుల పనులు జరుగుతున్నాయి. ఇలా ఎదో ఒక పనితో, 24/7 అమరావతి బిజీగా ఉంటే, కొంత మంది ఇంకా గ్రాఫిక్స్ అంటూ ఎందుకు అంటున్నారో వాళ్ళకే తెలియాలి.