అమరావతి... మొన్నటి వరకు 5 కోట్ల ఆంధ్రుల గర్వం... భవిష్యత్తు మీద ఆశ... కాని ప్రభుత్వం మారటంతో మొత్తం తారు మారు అయ్యింది.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఇప్పుడు అమరావతి ఒక ప్రాధాన్యతా అంశం కాదు... అమరావతి పై ప్రతిపక్షంలో ఉండగా జగన్ చేసిన వ్యాఖ్యలు, ఆయన వైఖరి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కొనసాగింది. అమరావతి నుంచి ప్రపంచ బ్యాంక్ వెళ్ళిపోయింది, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు వెళ్ళిపోయింది, అమరావతిలో పెట్టుబడులు పెట్టాలి అనుకుని ఒప్పందం చేసుకున్న వాళ్ళు ఆగిపోయారు, స్టార్ట్ అప్ ఏరియా అభివృద్ధి చేస్తాం అన్న సింగపూర్ ప్రభుత్వం ఆగిపోయింది.. ఇలా అమారావతిలో అన్నీ రివెర్స్ లో జరుగుతున్నాయి. చివరకు అమరావతి నిర్మాణాలు కూడా ఆగిపోయాయి. జగన్ మోహన్ రెడ్డి గారు, ప్రధాని మోడీని కలిసి, ప్రస్తుతానికి అమరావతికి డబ్బులు అవసరం లేదు, తరువాత చూద్దాం అని చెప్పారు అంటే ఆయన వైఖరి ఇక్కడే అర్ధమైపోతుంది.
అయితే ప్రపంచ బ్యాంక్, అమరావతికి రుణం ఇవ్వకుండా తప్పుకున్న సమయంలో, జగన్ ప్రభుత్వం, శాసనసభ సాక్షిగా చెప్పిన విషయాలు, చేసిన ఆరోపణలు తప్పు అని ఈ రోజు తేలిపోయింది. ప్రపంచ బ్యాంక్ తప్పుకున్న సమయంలో, అంతా చంద్రబాబు వైఖరి వల్లే, చంద్రబాబు అవినీతి చూసే ప్రపంచ బ్యాంక్ వెనక్కు వెళ్ళిపోయింది అంటూ, జగన్ ప్రభుత్వం చెప్పింది. అయితే, ఇప్పుడు హన్స్ ఇండియా అనే జాతీయ పత్రిక చేసిన ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు బయట పడ్డాయి. అమరావతికి లోన్ ఇవ్వటంలో, ప్రపంచ బ్యాంక్ ఎందుకు వెనక్కు వెళ్లిందో తెలుసుకోవటానికి, హన్స్ ఇండియా, ఆర్టీఐ ద్వారా విషయాలు సేకరించింది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, జూన్ 25, కేంద్ర ఆర్ధిక శాఖ నుంచి సమీర్ కుమార్ ఖారే అనే అడిషనల్ సెక్రటరీ ర్యాంక్ ఉన్న అధికారి, రాష్ట్రానికి లేఖ రాస్తూ, అమరావతి రుణం పై, మీ వైఖరి చెప్పండి అంటూ లేఖ రాసారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలానటి స్పందన రాలేదు. మళ్ళీ జూలై 1న, బండా ప్రేయషి అనే డైరెక్టర్ ర్యాంక్ ఉన్న అధికారి, కేంద్ర ఆర్ధిక శాఖ నుంచి రాష్ట్రానికి మరో లేఖ రాసారు.జూలై 23 న ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అమరావతి వచ్చి పర్యవేక్షణ చేసి లోన్ ఇస్తారు, మీరు ఏ సంగతి వెంటనే చెప్తే, మేము వారికి తెలియ చేస్తాం, మీ వైఖరి కోసం జూలై 15 వరకు సమయం ఇస్తున్నాం, ఈ లోపు మీరు అమరావతి రుణం పై ఒక స్పష్టత ఇవ్వండి, లేకపోతె, అమరావతి పై మీకు ఇంట్రెస్ట్ లేదని, మేము అర్ధం చేసుకుని, ఇదే విషయం ప్రపంచ బ్యాంక్ కు చెప్తాం అంటూ లేఖ రాసారు. అయితే జూలై 15 కు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రిప్లై ఇవ్వకపోవటంతో, కేంద్రానికి విషయం అర్ధమైంది. జగన్ ప్రభుత్వానికి, అమరావతి అంటే ఇంట్రెస్ట్ లేదని తెలుసుకుని, ఇదే విషయాన్ని ప్రపంచ బ్యాంక్ కు చెప్పారు. దీంతో ప్రపంచ బ్యాంక్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు వెంటనే ప్రకటించింది. కేంద్రం ఎన్ని సార్లు అడిగినా, జగన్ ప్రభుత్వం స్పందించక పోవటంతో, కేంద్రం కూడా ప్రపంచ బ్యాంక్ కు చెప్పేసింది. దీంతో దాదపుగా 7 వేల రూపాయలు రుణం, మన రాష్ట్రం నుంచి వెనక్కు వెళ్ళిపోయింది.