రాజధానికే తలమానికమైన సీడ్ యాక్సెస్ రోడ్డు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. బ్లూ అండ్ గ్రీన్ సిటీలో భాగంగా అమరావతిని బ్లూ సిటీగా మార్చటంలో ఈ రోడ్డు ముఖ్య పాత్ర పోషించనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు సహా మొత్తం 8 ప్రాధాన్య రహదారులు వచ్చే ఏడాది జనవరి ఆఖరుకల్లా పూర్తి కానున్నాయి. ఈ రోడ్లను అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మిస్తుం డడంతోపాటు ఇప్పటి వరకూ దేశంలో ఎక్కడా లేని విధంగా, నిర్మాణ సమయంలోనే వాటి వెంబడి ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోడ్ల పక్కన పలు రకాలకు చెందిన వేలాది మొక్కలను పెంచనుండడం ఓ ప్రత్యేకత! దాదాపు ఎక్కడా మలుపుల్లేకుండా, సువిశాలంగా రూపుదాల్చుతుండడం ఇంకో విశేషం..
ప్రాధాన్య రహదారులుగా వ్యవహరిస్తున్న ఈ 8 రోడ్లలో రాజధానికి జీవరేఖగా అభివ ర్ణితమవుతున్న సీడ్ యాక్సెస్ రోడ్డుతోపాటు మరో 7 రహదా రులున్నాయి. వీటిల్లో సీడ్ యాక్సెస్ రహదారి అమ రావతిలోని తూ ర్పు- పడమర దిక్కులను కలుపుతూ ఉండగా, మిగిలిన వాటిల్లో 4 ఉత్తరం నుంచి ద క్షిణ దిశ లను, 3 తూర్పు- పశ్చిమ ప్రాంతాలను అనుసం ధానిస్తున్నాయి. ఈ రోడ్లన్నింటి పొడవు మొత్తం 85.17 కిలో మీటర్లు కాగా, వీటి మొత్తం నిర్మాణ వ్యయం రూ.1,306 కోట్లు. వర్షపు నీరు నిలిచి, రోడ్లు పాడవడాన్ని నిరోధించేందుకు స్మార్ట్ వాటర్ డ్రెయిన్లను ఏర్పాటు చేస్తున్నారు. దాని పక్కనే లీకులకు తద్వారా కలుషిత మయ్యేందుకు ఆస్కారం లేని విధంగా తాగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.
విద్యుత్తు, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) కోసం యుటిలిటీ డక్టులను నిర్మించనున్నారు. వాడిన జలాలను రీసైక్లింగ్ చేసి టాయ్ లెట్ ఫ్లషింగ్, గార్డెనింగ్, ల్యాం డ్‌స్కేపింగ్ తదితర అవసరాలకు ఉప యో గించుకు నేందుకు వీలు కల్పించే రీయూజ్డ్ వాటర్ పైపులైన్లనూ నిర్మించనున్నారు. పాదచారులు, సైక్లిస్టుల కోసం వేర్వేరు మార్గాలు, నేత్రపర్వం కలిగించే అవెన్యూ ప్లాంటేషన్, నాణ్యమైన స్ట్రీట్ ఫర్నిచర్ తదితరాలూ ఈ రోడ్ల పక్కన కొలువు దీరనున్నాయి. భూఉపరితలంపై ఎక్కడా కనిపించకుండా, భూగర్భంగుండానే సాగే విద్యుత్తు సరఫరా వ్యవస్థను కల్పించనున్నారు.