రాజధాని అమరావతి మార్పు పై, వైసీపీ నేతలు ఎంతో అహంకారంతో మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఒక పక్కన ఈ విషయం కోర్టులో ఉన్నా సరే, రెండు రోజుల క్రితం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, రాజధానిని విశాఖకు మార్చి తీరుతాం అని, ఎవరూ దాన్ని ఆపలేరు అంటూ ఏకంగా ఈ అంశం కోర్టులో ఉండగానే చెప్పటం, సంచలనంగా మారింది. ఈ నేపధ్యంలోనే, విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల ప, అమరావతి పరిరక్షణ సమితి తరుపున, ఆ సంస్థ కార్యదర్శి హోదాలో, గద్దె తిరుపతిరావు, హైకోర్ట్ లో పిటీషన్ వేసారు. ఈ విషయం పై, ఈ రోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. రాజధానిని అమరావతి నుంచి, విశాఖకు తరలించి వేస్తూ, ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని, అలాగే మార్చ్ 18 వ తేదీన, ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ఎంప్లాయిస్ అసోసియేషన్, కమిటీ తీర్మానం, వాళ్ళు తరువాత మాట్లడుతూ, సియం ఓరల్ ఆదేశాలు ఇచ్చారు, మే 31 లోపు వైజాగ్ వెళ్లిపోవాలి అంటూ చెప్పారు అంటూ, ఈ విషయాలు పిటీషనర్ తమ వాదనల్లో పేర్కున్నారు.
ఈ సందర్భంగా, పిటీషనర్ వ్యాఖ్యల పై వివరణ ఇవ్వాలి అంటూ, హైకోర్ట్, అడ్వొకేట్ జెనరల్ ను ఆదేశించింది. అయితే దీని పై వివరణ ఇస్తూ, ఏజీ కోర్టకు ఒక విషయం స్పష్టం చేసారు. రాజధాని తరలింపుకు సంబంధించి చట్ట సభల్లో, బిల్లులు పాస్ అవ్వకుండా ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోదు అని చెప్పి, అడ్వొకేట్ జెనరల్ కోర్ట్ కు తెలిపారు. అయితే దీని పై స్పందించిన హైకోర్ట్, ఇదే విషయం అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని, ఏజేజి కోరింది. దీని పై స్పందించిన అడ్వొకేట్ జెనరల్ , తమకు 10 రోజులు గడువు కావాలి అని కోరగా, హైకోర్ట్ దానికి అంగీకరించింది. అలాగే, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా, ఈ విషయంలో అఫిడవిట్ దాఖలు చెయ్యాలి అంటూ, హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.
అలాగే, ఈ లోపు కనుక రాష్ట్ర ప్రభుత్వం రాజధాని తరలింపు విషయంలో ముందకు వెళ్తే, తమ దృష్టికి తీసుకు రావాలి అని, కోర్ట్, పిటీషనర్ తో తెలిపింది. దీంతో కేసును పది రోజులకు వాయిదా వేసింది హైకోర్ట్. అయితే, ఇదే సందర్భంలో, రెండు రోజుల క్రితం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, రాజధాని విశాఖగా అయ్యి తీరుతుందని, ఇది ఆపటం ఎవరి తరం కాదు అంటూ, విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల పై, పిటీషనర్ తరుపు న్యాయవాది, కోర్ట్ దృష్టికి తీసుకు వచ్చారు. అయితే, ఈ సందర్భంగా, కోర్ట్ స్పందిస్తూ, ఈ విషయం పై వివరణ ఇవ్వాలని, అడ్వకేట్ జనరల్ ను కోరింది. దీని పై కూడా త్వరలోనే వివరణ ఇవ్వనుంది ప్రభుత్వం. మొత్తానికి, ప్రభుత్వాన్ని ఫిక్స్ చేసే విధంగా, కోర్ట్ ఈ రోజు ఆదేశాలు ఇచ్చింది.