అమరావతి పాదయత్ర 36వ రోజు కొనసాగుతుంది. అయితే రాజమండ్రి బ్రిడ్జి పై నుంచి, ఈ రోజు అమరావతి పాదయత్ర వెళ్ళాల్సి ఉండగా, ప్రభుత్వం ఆ బ్రిడ్జిని మూసేయటంతో, ఈ రోజు గామన్ బ్రిడ్జి పై నుంచి అమరావతి పాదయాత్ర వెళ్లనుంది. ఈ రోజు దాదాపుగా 50 వేల మంది, పాదయాత్ర జరుగుతుందని, బ్రిడ్జి మొత్తం ప్రజలతో నిండిపోతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఈ రోజు, అమరావతి పాదయాత్రకు సంఘీభావం తెలపటానికి, టీవీ5 ఛైర్మన్ బీఆర్ నాయుడు, వంగవీటి రాధా, పరిటాల శ్రీరామ్, గంటి హరీష్ రాజమండ్రి చేరుకున్నారు. అమరావతి పాదయాత్రలో పాల్గునటానికి వెళ్తూ ఉండగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. పాదయత్రకు వెళ్ళటానికి వీలు లేదని, పోలీసులు ఆంక్షలు పెట్టారు. కారుకి అడ్డంగా పోలీసులు నుంచున్నారు. కారును అనుమతించకపోవడంతో బీఆర్ నాయుడు ఆటోలో వెళ్ళారు. దీంతో పోలీసులు ఖంగుతిని, వారిని కార్ లో వెళ్లేందుకు అనుమతి ఇవ్వటంతో, బీఆర్ నాయుడు, వంగవీటి రాధా, పరిటాల శ్రీరామ్, గంటి హరీష్ పాదయాత్ర ప్రదేశానికి వెళ్లారు.