అమరావతి అంటే చాలు అన్ని వైపుల నుంచి, విషం చిమ్మే ఒక జాతి మన రాష్ట్రంలో చేస్తున్న పనులు చూస్తూనే ఉన్నాం... రాజధాని శంకుస్థాపనకు నన్ను పిలవద్దు, నేను రాను అన్నోడు, అదే రాజధాని గురించి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు... రాజధానిలో ఒక్క ఇటుక అయినా పేర్చారా అని హేళన చేస్తున్నారు... రికార్డు టైంలో దేశం మొత్తం ఆశ్చర్యపోయే విధంగా కట్టిన, సచివాలయం కనిపించలేదు ఈయనకు... రెండు జాతీయ స్థాయిలో టాప్ యూనివర్సిటీలు మొదలైనా కనిపించిలా... సీడ్ యాక్సెస్ రోడ్ తో పాటు, మరిన్న రోడ్డులు పూర్తవుతున్నా, ఇంకా ఎన్నో పనులు జరుగుతున్నా కనిపించలా... సంవత్సర కాలం నుంచి, జరుగుతున్న విషయాలు తెలియవు ఏమో పాపం... మరో వైపు నుంచి ఇంకో కొత్త హీరో వచ్చాడు.. ఏమి మాట్లడతాడో త్లెఇయదు, ఎందుకు మాట్లాడతాడో తెలియదు..
అమరావతి మీద విషం చిమ్ముతూ పుస్తకాలు రాస్తే, ఈయన వచ్చి ఆ పుస్తకం ఆవిష్కరిస్తాడు... మరో పక్క బీజేపీ నాయకులు, మీకు లక్ష కోట్లు ఇచ్చాం పండగ చేసుకోండి అంటారు.. మీకు అమరావతి అవసరమా అంటారు... మీ మోఖలకి మయసభ కట్టుకుంటారా అంటారు... ఇలాంటి వారి కోసం సిఆర్డీఏ ఒక వీడియో రిలీజ్ చేసింది.. అందులో ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న అని పనులు, ఏమి ఉన్నాయి, ఎలా సాగుతున్నాయి లాంటివి చూడవచ్చు.. వీడియో ఒక్కటే కాదు, 156 పేజీల స్టేటస్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ మూడు సంవత్సరాల్లో అమరావతిలో ఏమి జరిగింది, డేట్ వైజ్ రిపోర్ట్ ఇచ్చింది... ఎన్ని పనులు జరుగుతున్నాయో సవివరంగా చెప్పింది.. అంతే కాదు భూములు త్యాగం చేసిన రైతన్నల కోసం ఏమి చేస్తుంది చెప్పింది... పెన్షన్లు, నైపుణ్య శిక్షణ, ప్లాట్ల కేటాయింపు ఇలా అన్ని వివరాలు చెప్పింది.... 91 పేజిలో దాదాపు 46 సంస్థలు పెట్టుబడి పెట్టటానికి సిద్ధంగా ఉన్నాయని అని వివరించి, ఎంత పెట్టుబడి పెట్టేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చేది, ప్రస్తుతం ప్రాజెక్ట్ స్థితి ఇలా అన్నీ వివరించింది.
ప్రపంచం లోనే ఇంత వేగం గా ఒక కొలిక్కి వస్తున్న నూతన రాజధాని నిర్మాణం అమరావతి ఒక్కటే ..అది కూడా ప్రభుత్వం దగ్గర తగినంత భూమి , నిధులు లేకపోయినా కూడా...కేవలం ఒకే ఒక్క వ్యక్తి మీద నమ్మకంతో, 33 వేల ఎకరాలు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేసారు రైతులు... అమరావతి మీద విషం చిమ్ముతూ, నిత్యం దాన్ని నాశనం కోరుకునే సైకోలకి, ఈ రిపోర్ట్ అంకితం... మీకు బుర్ర ఉంటే ఇలాంటివి చదివి అర్ధం చేసుకు చావండి... ఈ వీడియో చూడండి, డిటైల్డ్ రిపోర్ట్ చూడండి, రాజధాని కోసం, ఏ రోజు ఏ పని చేసారో, ఏ పనులు జరుగుతున్నాయో తెలుస్తుంది. వీడియో ఇక్కడ చూడవచ్చు https://youtu.be/K_XPss7tnJc ... రిపోర్ట్ ఇక్కడ చూడవచ్చు... https://crda.ap.gov.in/crda_norifications/NOT04089564/01~Amaravati%20Project%20Report%20Edition%20No3%20Status%20March%202018-compressed.pdf