అమరావతిలోని, స్టార్టప్ ఏరియా ఫేస్1 దగ్గర వెల్‌కం గ్యాలరీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ హాజరయ్యారు. లింగాయపాలెం స్టార్టప్‌ ఏరియాలో మొత్తం 50 ఎకరాలలో రూ.44 కోట్లతో వెల్‌కమ్ గ్యాలరీని నిర్మించనున్నారు. బిజినెస్‌ ప్రమోషన్‌కు వీలుగా గ్యాలరీ భవన నిర్మాణం జరుగనుంది. శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ అంకుర అభివృద్ధిలో భాగంగా వెల్‌కమ్‌ గ్యాలరీ నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. దేశంలోనే మొదటిసారి రైతులు 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారని ముఖ్యమంత్రి కొనియాడారు. సింగపూర్‌ ప్రభుత్వం మద్దతుతో.. టెక్నాలజీ డెవలెప్‌ చేయాలన్నా, ప్రొజెక్టు చేయాలన్నా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చునని ఆయన అన్నారు. చాలా అంశాల్లో సింగపూర్‌ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకున్నామని చెప్పారు.

startup 10012019

ఏంటీ ప్రాజెక్టు? అమరావతిలో 1,691 ఎకరాల్ని స్టార్టప్‌ ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు సింగపూర్‌కి చెందిన అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్‌ సంస్థల కన్సార్టియంను రాష్ట్ర ప్రభుత్వం స్విస్‌ఛాలెంజ్‌ విధానంలో ప్రధాన అభివృద్ధిదారుగా ఎంపిక చేసింది. సింగపూర్‌ సంస్థల కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) కలసి స్టార్టప్‌ ఏరియాని అభివృద్ధి చేయనున్నాయి. ఈ రెండూ కలసి ఏర్పాటు చేసిన సంయుక్త భాగస్వామ్య సంస్థే ఏడీపీ. 1,691 ఎకరాల్ని మూడు దశల్లో అభివృద్ధి చేయాలన్నది ప్రతిపాదన.

startup 10012019

ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం... ఉత్ప్రేరకాభివృద్ధిగా 50 ఎకరాల్ని మొదట ఏడీపీ అభివృద్ధి చేయాలి. దానిలో భాగంగానే ‘వెల్‌కం గ్యాలరీ’ ప్రాజెక్టుని ఏడీపీ చేపట్టింది. స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి కోసం మొదట ఒప్పందం చేసుకున్నప్పుడు వెల్‌కం గ్యాలరీ ప్రాజెక్టు ప్రతిపాదన లేదు. స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు పనులు చేపట్టడంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో... మొదట ఐదు ఎకరాల్లో ‘ఫేజ్‌ జీరో’ పేరుతో ఒక ప్రాజెక్టు చేపడతామని సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదించింది. దీన్ని ‘వెల్‌కం గ్యాలరీ’గా మార్చారు. భవిష్యత్‌ అవసరాల కోసం 75 వేల చ.అడుగుల నిర్మిత ప్రాంతం గల భవనాన్ని ఇక్కడ నిర్మిస్తారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read