ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే, ఏది అంటే, ఎవరైనా ఏమి చెప్తాం ? అమరావతి అంటూ ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్తాం. రాజకీయ ఇబ్బందుల్లో, ఉండి అమరావతి పరిస్థితి ఇలా ఉంది కాని, ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్పుకునేలా అమరావతి తయారు అయ్యేది. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులే ఇందుకు ఉదాహరణ. ఒక్క ఎకరం ఇవ్వటానికి, రక్తపాతం జరిగే ఈ రోజుల్లో, ఒక మనిషిని నమ్మి 33 వేల ఎకరాలు ఇచ్చారు రైతులు. అక్కడ అంతా గ్రాఫిక్స్ అన్న చోటే, జగన్ మోహన్ రెడ్డి గారు, పరిపాలన సాగిస్తున్నారు. అవి గ్రాఫిక్స్ కాదు, నిజమైన బిల్డింగ్ లు అని చెప్పటానికి, ఇదే ఉదాహరణ. అయితే అధికారం మారిపోయిన తరువాత, అమరావతి రాత కూడా మారిపోయింది. ఎన్నో ఆశలతో అమరావతి నిర్మాణం అవుతుంది అనుకున్న ఆంధ్రులకు, నిరాశే మిగిలింది. ప్రపంచ బ్యాంక్ నుంచి సింగపూర్ ప్రభుత్వం దాకా, అన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన షాక్ తో, ఆంధ్రుడు మరింత కుమిలి పోయే పరిస్థితి.

home 22112019 1

ఒక పక్క హైదరాబాద్ తో తెలంగణా ప్రజలు సంతోషంగా ఉంటే, మనకు మాత్రం, ఇప్పటి పాలకుల తీరు వల్ల, అమరావతి మా రాజధాని అని చెప్పుకునే అవకాసం కూడా లేకుండా పోయింది. జమ్మూ కాశ్మీర్ విభజన నేపధ్యంలో, కేంద్ర హోం శాఖ, కొత్త ఇండియా మ్యాప్ రిలీజ్ చేసింది. అందులో అన్ని రాష్ట్రాలకు, వాటి వాటి రాజధానులు పెట్టిన కేంద్రం, మన రాష్ట్రానికి మాత్రం, రాజధాని పెట్టలేదు. ఇంకా మన రాజధాని హైదరాబాద్ అనే విధంగానే, తెలంగాణాకు చూపించింది. అయితే మొన్నటి వరకు మ్యాప్ లో ఉన్న అమరావతి ఇప్పుడు మాయం కావటం పై, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో బాధ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఈ పరిస్థితి వచ్చింది అంటూ కుమిలిపోతున్నారు. అయితే ప్రజల తరుపున స్పందించాల్సిన ప్రభుత్వం మాత్రం, మాట్లాడలేదు.

home 22112019 1

ఎక్కడా కేంద్రాన్ని ఇదేమిటి అంటూ కేంద్రం ప్రశ్నించలేదు. అయితే, పార్లమెంట్ సమావేశాలు మొదలు అయ్యి, మూడు రోజులు యినా, 22 మంది ఎంపీలు ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్పందించలేదు. దీంతో తెలుగుదేశం పార్టీ ఈ అంశం పై పార్లమెంట్ లో లేవనెత్తింది. ఎంపీ గల్లా జయదేవ్, ఈ విషయం పై కేంద్రాన్ని ప్రశ్నిస్తూ, ఇది మా రాష్ట్రాన్ని తీవ్రంగా అవమానపరిచే చర్య అంటూ, అభ్యంతరం వ్యక్తం చేసి, దీని పై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. అయితే టిడిపి విజ్ఞప్తి పై, కేంద్ర హోం శాఖ స్పందించింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఈ విషయం పై మాట్లాడుతూ, భారత దేశ మ్యాప్ లో, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ, త్వరలోనే సవరించిన మ్యాప్ రిలీజ్ చేస్తామని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read