ఏపి అంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం కూడా.. అలాంటి ఈ రెండు ప్రాజెక్ట్ లు పూర్తి చెయ్యటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తుంటే, మిగిలిన వారు ఇబ్బంది పెడుతున్నారు..... నిన్న పోలవరం విషయంలో, కేంద్రం ఇబ్బంది పెట్టిన సంగతి చూశాం... ఇప్పుడు అమరావతి విషయంలో, కొంత మంది అదృశ్య శక్తులు ఆపటానికి చూస్తున్నారు... అమరావతిని అడ్డుకోవటమే ధ్యేయంగా రాష్ట్రంలో ఉన్న కొంత మంది, రాజధాని నిర్మాణం కోసం లోన్ ఇస్తున్న ప్రపంచ బ్యాంకుకి, లోన్ ఇవ్వద్దు అంటూ, లేఖలు రాసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు వీరికి తోడు మరి కొంత మంది ప్రపంచ బ్యాంకుకు మరో లెటర్ రాశారు...
"జరగబోయే విపరిణామాలకు మీరే బాధ్యతహించాల్సి ఉంటుంది' అని హెచ్చరించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం. మేధా పాట్కర్, ప్రపుల్ల సమంత్ర, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ ఈఏఎస్ శర్మ తోపాటు 46 మంది సామాజిక కార్యకర్తలు "నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్ మెంట్" పేరిట ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కు ఇటీవల లేఖ రాశారు. రాజదాని అమరావతికి ఎలాంటి రుణం ఇవ్వద్దు అంటూ లేఖలు రాశారు... నిజానికి వీరి వెనుక మరికొంత మంది అదృశ్య శక్తులు ఉన్నాయి... ఈ అదృశ్య శక్తులు మొదటి నుంచి అమరావతి ఆపటానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి...
అయితే ఇది వరకు కొంత మంది రాష్ట్రానికి చెందిన వారు రుణం ఇవ్వద్దు అంటూ లేఖలు రాశారు... అది అప్పట్లో సంచలనం అయ్యింది.. అయితే, ప్రపంచ బ్యాంకు బోర్డు ఈ విషయాన్ని అంతగా పట్టించుకోకుండా అమరావతి ప్రాజెక్ట్ కు రుణం మంజూరు చేసేందుకు సుముఖంగా ఉందన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా, కొంత మంది వెనుక ఉండి, సామాజిక వేత్తల పేరిట లోన్ రాకుండా, అమరావతిలో భవిష్యత్తులో తలెత్తబోయే విపరిణామాలకు రుణమిచ్చిన సంస్థలుగా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటూ, ప్రపంచ బ్యాంకును హెచ్చరిస్తూ లేఖలు రాశారు... ఒక పక్క కేంద్రం నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే, రాష్ట్రం లోన్ కోసం వెళ్తుంటే, ఆ లోన్ కూడా రాకుండా, రాష్ట్రంలోని అదృశ్య శక్తులు, ఆ లోన్ రాకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు...