ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, అప్పట్లో అన్ని ప్రతిపక్ష పార్టీలు, ఏకగ్రీవంగా ఆమోదించటంతో, అమరావతి రాజధానిగా నిర్ణయం తీసుకోవటం, అలాగే భూసమీకరణ కోసం, రైతులతో ఒప్పందానికి, ఇతర పనులకు సిఆర్డీఏ చట్టం తీసుకుని రావటం, అమరావతి నిర్మాణం మొదలు కావటం, దాదపుగా 10 వేల కోట్లు ఖర్చు పెట్టటం, 2017 నుంచి అమరావతి నుంచే సచివాలయం పని చేయటం, అలాగే వివిధ డిపార్టుమెంటులు అన్నీ, ఇక్కడ భావనలు కట్టుకోవటం, రాజ్ భవన్ ఇక్కడ నుంచే పని చేయటం, హైకోర్టు ఇక్కడ నుంచే పని చేయటం, అసెంబ్లీ, శాసనమండలి ఇక్కడ నుంచే పని చేయటం, ఇవన్నీ చూసాం. ఎన్నికల ముందు అమరావతి రాజధానిగా ఉంటుందని, దానికి నా ఇల్లు ఇక్కడ కట్టుకోవటమే నిదర్శనం అని జగన్ మోహన్ రెడ్డి చెప్పటంతో, అమరావతి ప్రాంత వాసులు కూడా వైసీపీనే గెలిపించారు. అయితే వైసీపీ అధికారంలోకి రాగానే, అమరావతి నిర్మాణం ఆగిపోయింది. నిర్మాణం ఏదో ఒక రోజు మొదలు అవుతుందని, ఆశగా చుసిన రైతులకు చివరకు నిరస మిగిలింది. అమరావతి మూడు ముక్కలు అయ్యింది. కేవలం అసెంబ్లీకే పరిమతం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక మరో పక్క సిఆర్డీఏ రద్దు అయ్యింది. దీంతో, రైతులు న్యాయ పోరాటం మొదలు పెట్టారు.

తమతో కుదుర్చుకున్న ఒప్పందాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రవర్తిస్తుంది అంటూ, రైతులు కోర్టు మెట్లు ఎక్కారు. ఇందులో అనేక రకాల కేసులు ఉన్నాయి. సిఆర్డీఏ రద్దు, అగ్రిమెంట్ ఉల్లంఘన, రైతులకు కౌలు, ప్రభుత్వం నియమించిన కమిటీల చట్ట బద్ధత, శాసనమండలిలో ఉండగానే బిల్లు ఆమోదించటం, సెలెక్ట్ కమిటీన పరిగణలోకి తీసుకోక పోవటం, ఇలా మొత్తంగా 90కు పైగా కేసులు నమోదు అయ్యాయి. వీటి పై హైకోర్ట్ గత మూడు సార్లుగా స్టేటస్ కో ఇస్తూ వస్తుంది. పోయిన వాయిదాలో, అక్టోబర్ 5 నుంచి రోజు వారీ విచారణ చేసేందుకు, సాధ్యా సాధ్యాలు పరిశీలన చేస్తాం అని చెప్పింది. ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి వచ్చే లాయర్లు, హైబ్రిడ్ సిస్టం ద్వారా, తమకు వాదనలు వినిపించే అవకాసం ఇవ్వాలని కోరారు. దీంతో హైకోర్టు ఏమి చెప్తుంది ? ఈ రోజు నుంచి రోజు వారీ విచారణ ఉంటుందా ? భౌతికంగా విచారణ చేస్తారా ? లేక ఆన్లైన్ లోనే చేస్తారా ? లేక ఇక్కడ లాయర్లకు భౌతికంగా అవకాసం ఇచ్చి, ఢిల్లీ లాయర్లకు ఆన్లైన్ లో అవకాసం ఇస్తారా ? రోజు వారీ విచారణ ప్రారంభం అవుతుందా ? ఇలాంటి అనేక అంశాలు, ఈ రోజు క్లారిటీ వస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read