అమరావతిని ఇక్కడ నుంచి తరలించటానికి వైసీపీ ప్రభుత్వం, ప్రజలను ఒప్పించటానికి రాజకీయ వ్యూహాన్నే అమలు చేస్తుంది. ముందుగా ఇక్కడ వరదలు వస్తాయి, మొత్తం ప్రాంతం మునిగిపోతుంది అనే విషయం ప్రజల్లోకి తీసుకు వెళ్ళటానికి చూసారు, కాని ఇది వర్క్ అవుట్ అవ్వలేదు. ఎందుకంటే, అమరావతి రాజధాని ప్రాంతం, ఎంత పెద్ద రికార్డు వరద వచ్చినా మునిగింది లేదు. 2009 అతి పెద్ద వరద వచ్చినా, కర్నూల్ మునిగింది కాని, అమరావతి మునగలేదు. అమరావతికి వరద ముప్పులేదని గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పిన విషయం కూడా తెలిసిందే. ఆ తరువాత, అమరావతి ప్రాంతం పై కుల ముద్ర వేసారు. అయితే కుల ముద్ర కూడా వర్క్ అవ్వలేదు. ఎందుకంటే అమరావతి ప్రాంతం, తాడికొండ నియోజకవర్గంలో ఉంది. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అలాగే పక్కనే ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ కూడా ఓడిపోయారు అంటే, వైసీపీ వేసిన కుల ముద్ర తప్పు అని ప్రజలకు అర్ధమైంది. అందుకే వైసీపీ ప్లాన్ మార్చింది.
అమరావతిలో మొత్తం చంద్రబాబు బినామీలే కొన్నారని, అమరావతి ప్రకటనకు ముందే అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ ప్రచారం మొదలు పెట్టారు. ఇక్కడ అమరావతి రాజధాని అయితే, చంద్రబాబుకే లబ్ది అని, అక్కడ రైతులకు ఏమి ఉపయోగం లేదు అంటూ ప్రచారం మొదలు పెట్టరు. అసెంబ్లీలో కూడా 4070 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ ప్రచారం చేసారు. ఏవేవో లెక్కలు చెప్పారు, కాని ఎక్కాడ డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేదు. గత మూడేళ్ళుగా సాక్షిలో రాసిందే, అసెంబ్లీలో చెప్పారు. అయితే అమరావతి ప్రాంతంలో అసలు, చంద్రబాబు వచ్చిన దగ్గర నుంచి, అమరావతి ప్రకటన వచ్చేంత వరకు, 150 ఎకరాలు కూడా రిజిస్ట్రేషన్ అవ్వనట్టు లెక్కలు ఉన్నాయని టిటిపి చూపిస్తుంది.
అయితే, ఈ రోజు వైసీపీ ప్రెస్ ను పిలిచింది. అన్ని ఆధారాలతో ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి బయట పెడుతున్నాం, రమ్మని మీడియాకు చెప్పింది. మీడియా మొత్తం లైవ్ లు ఇచ్చారు. తీరా అక్కడ చూస్తే, అసెంబ్లీలో బుగ్గన మాట్లాడిన దాన్ని, వేరే ఎవరితోనే వాయిస్ ఓవర్ చెప్పించి, ఇదే ఆధారాలు అంటూ అంబటి మీడియాకు చెప్పారు. ఇంత హడావిడి చేసి, ఆధారాలు చూపించకుండా, అవే ఆరోపణలు చెయ్యటంతో, అసలు వైసీపీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని అర్ధమైంది. ప్రభుత్వంలో ఉండి కూడా, వైసీపీ కేవలం పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి, ఏదో జరిగిపోయింది అంటూ, గతంలో చెప్పిందే చెప్పింది అంటే, అక్కడ ఏమి జరగలేదని అర్ధమవుతుందని అంటున్నారు. ఇలా ఈ రోజు వైసీపీ ఏదో బయట పెడుతుంది అనుకుంటే, ఏదో జరిగింది.