సత్తెనపల్లి వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. సత్తెనపల్లి వైసీపీ కన్వీనర్ అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా గోశాలలో అసమ్మతి నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పలువురు జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు హాజరయ్యారు. దీంతో సత్తెనపల్లి వైసీపీలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అంబటి పార్టీపరంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అందరికీ సమ ప్రాధాన్యం కల్పించడం లేదని అసమ్మతి వర్గం ప్రధానంగా ఆరోపిస్తోంది. అంబటి రాంబాబు ఇదే విధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో సహకరించకూడదని ఆయన అసమ్మతి వర్గం భావిస్తోంది.
సత్తెనపల్లిని యోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అంబటి రాంబాబును మేము బరాయించలేం, ఆయన మా కొద్దంటూ కార్యకర్తలు గళమెత్తారు. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ముగింపు సందర్భంగా సోమవారం రాత్రి స్థానిక గోళాల కల్యా ణ మండపంలో అంబటి వ్యతిరేకుల సమావేశం జరిగింది. సభకు వైసీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు గార్లపాటి ప్రభాకర్ అధ్యక్షత వహించగా, రాజుపాలెం జడ్పీ టీసీ మర్రి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ మండలంలో తనతో సంబంధం లేకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒంటెద్దు పోకడలు పోతున్నారన్నారు. అంబటి నాయకత్వంపై తాము పలుసార్లు జగన్కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. నియోజకవర్గంలో గ్రామాల్లో గ్రూపులు పెడుతూ పార్టీ నాయకులను, కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్న అంబటి రాంబాబును మార్చాలంటూ అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
డాక్టర్ గజ్జల నాగభూషణంరెడ్డి మాట్లాడుతూ అంబటి రాంబాబు నియోజకవర్గంలో పార్టీని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వటంలేదన్నారు. కార్యకర్తలు, నాయకులు పలువురు అసమ్మతితో ఉన్నారన్నారు. ముప్పాళ్ళ మం డల నేత రహమతుల్లా అంబటి రాంబాబు చేసిన పొరపాట్ల వల్లనే గతంలో ఓడిపోవటం జరిగిందన్నారు. పొరపాట్ల గురించి ఎన్నిసార్లు చెప్పినా మార్చుకోకుం డా ఇంకా పొరపాట్లు చేస్తున్నారన్నారు. గ్రామాల్లో వర్గాలను తయారుచేస్తు న్నారన్నారు. అంబటిని మా ర్చి మంచి సమన్వయకర్త కోసం అందరూ ఐక్యంగా ప నిచేస్తామన్నారు.